సరదాగా ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు గల్లంతు

అబ్దుల్లాపూర్‌మెట్ (CLiC2NEWS): జలపాతం చూసేందుకు వెళ్లి ఇద్దరు బాలురు నీట మునిగి గల్లంతయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నలుగురు స్నేహితులు పెద్ద అంబర్‌పేట్ రింగ్‌రోడ్డు సమీపంలోని చెక్ డ్యాం వద్దకు వెళ్లారు. సరదాగా నీటిలోకి దిగి గల్లంతయ్యారు. ఈ ప్రమాదంలో ఇద్దరు బాలురు వసి, సుర్ఫియాన్ గల్లంతయ్యారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వీరిరువురు పాత నగరంలోని బార్కాస్ షాహినగర్ ప్రాంతానికి చెందిన వారుగా తెలుస్తోంది.