Alert : తెలంగాణలో రెండు రోజులు వర్ష సూచన

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ (గురువారం), రేపు (శుక్రవారం) వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. జార్ఖండ్, బిహార్ ప్రాంతాల్లో కొనసాగుతున్న అప్పపీడనం సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో గురు, శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.