భార‌త్‌లో రెండు ఒమిక్రాన్ కేసులు

వెల్ల‌డించిన కేంద్ర ఆరోగ్య శాఖ‌

ఢిల్లి (CLiC2NEWS): క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భార‌త్‌లోనూ వెలుగుచూసింది. ఈ కొత్త వేరియంట్ కు సంబంధించిన రెండు కేసుల్ని దేశంలో గుర్తించిన‌ట్టు గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. విదేశాల నుండి క‌ర్ణాట‌క వ‌చ్చిన ఇద్ద‌రు పురుషుల్లో ఒమిక్రాన్ వేరియంట్ బ‌య‌టిప‌డిన‌ట్లు వెల్ల‌డించింది. వీరికి కొవిడ్ పాజిటివ్ నిర్థార‌ణ కావ‌డంతో ఆ న‌మూనాల‌ను జీనోమ్ సీక్వెన్పింగ్ విశ్లేష‌ణ కోసం పంపించారు. వారిద్ద‌రిలో ఒమిక్రాన్ ఉన్న‌ట్టు ఇండియ‌న్ సార్స్‌-కోవ్‌-2 జోనోమిక్స్ (INSACOG) నిర్థారించింది.

ద‌క్షిణాఫ్రికాలో మొద‌లైన ఒమిక్రాన్ 29 దేశాల‌కు వ్యాపించింద‌ని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్ర‌పంచ వ్యాప్తంగా 373 ఒమిక్రాన్ కేసులు న‌మోద‌య్యాయి. గ‌రిష్టంగా ద‌క్షిణాఫ్రికా లో 183  కేసులు న‌మోద‌య్యాయ‌ని వెల్లడించింది.

 

త‌ప్ప‌క‌ చ‌ద‌వండి

మాస్క్ ధ‌రించ‌క‌పోతో రూ.1000 జ‌రిమానా

 

 

Leave A Reply

Your email address will not be published.