మెదక్ జిల్లాలో ఈతకు వెళ్లి ఇద్దరు మృతి

మెదక్ (CLiC2NEWS): జిల్లాలోని నర్సాపూర్ మండలం తుజాల్పూర్ అర్జునతండాలో విషాదం అలుముకుంది. అర్జునతండాకు చెందిన బాలురు మల్లన్న సాగర్ కాలువలో ఈతకు దిగి మృతి చెందారు. వీరు సంగారెడ్డిలోని ఐటిఐ కళాశాలలో చదువుతున్నారు. ఆదివారం ఇద్దరు కలిసి సరదాగా కాలువలోకి ఈతకోసం వెళ్లి మత్యువాత పడ్డారు. పిల్లలు విగత జీవులుగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.