ఉక్రెయిన్, చైనాలో మెడిసిన్.. ఆ విద్యార్థులకు రెండేళ్ల ఇంటర్న్‌షిప్
ఢిల్లీ (CLiC2NEWS): కొవిడ్ కారణంగా, ఉక్రెయిన్-రష్యా యుద్ధం వలన స్వదేశానికి తిరిగివచ్చిన మెడిసిన్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం మరో వెసులబాటు కల్పించింది. జూన్ 30, 2022లోపు భారత్‌కు తిరిగి వచ్చి.. అనంతరం ఆయా సంస్థల నుండి డిగ్రీ పట్టాపొందిన విద్యార్థులకు ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ (FMGE) రాసేందుకు అనుమతి ఇస్తున్నట్లు నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) వెల్లడించింది. అయితే.. ఎఫ్ ఎంజి పరీక్షలో అర్హత సాధించిన అభ్చర్థులు రెండేళ్ల పాటు కంపల్సరీ రొటేటింగ్ మెడికల్ ఇంటర్న్‌షిప్ (CRMI) చేయాల్సి ఉంటుందని తెలిపింది.
విదేశాల్లో వైద్య విద్య పూర్తిచేసిన విద్యార్థులు భారత్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే సిఆర్ఎంఐ తప్పనిసరి. ఇంతకు ముందు ఈ ఇంటర్నషిప్ వ్యవధి కేవలం ఒక ఏడాది మాత్రమే ఉండేది. ఈ సారి దానిని రెండేళ్లకు పెంచుతున్నట్లు వెల్లడించింది. భవిష్యత్తులో దీన్ని కొనసాగించే అవకాశం లేదని స్పష్టం చేసింది.