విద్యార్థులకు సైతం యుకె వీసా ఛార్జీలు పెరిగే అవకాశం..

UK Visa: బ్రిటన్‌కు వెళ్లే విద్యార్థులకు సైతం వీసీ ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. పర్యటకులతో పాటు వీరికి కూడా అన్ని కేటగిరీల వీసా ఫీజులను పెంచుతున్నట్లు యుకె ప్రభుత్వం వెల్లడించింది. భారతీయులు బ్రిటన్‌లో ప్రవేశించాలంటే వీసా తప్పనిసరి అన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్ 9 నుండి కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం వీసా ఆరు నెలల గడువుకి ఫీజు 115 పౌండ్లు ఉండగా.. పది శాతం పెరిగి 127 పౌండ్లకు చేరుకుంది. అదే విధంగా రెండేళ్ల కాలపరిమితి వీసా రుసుం కూడా పెరిగింది.
ప్రధాన దరఖాస్తు దారు సహా వారి డిపెండెంట్లు ప్రస్తుతం 490 పౌండ్లు చెల్లించాల్సి ఉంది. అది ఇక త్వరలో 524 పౌండ్లకు చేరనున్నట్లు సమాచారం. చైల్డ్ స్టూడెంట్ కు సైతం ఆరు నెలల నుండి 11 నెలల స్వల్ప కాలపరిమితి ఇంగ్లిష్ కోర్సు చదివే విద్యార్థుల ఫీజు కూడా 14 పౌండ్లు పెరగనుంది.