పోలవరంపై కేంద్ర జలశక్తి మంత్రి స్పందన..

ఢిల్లీ (CLiC2NEWS): వచ్చే ఏడాది నాటికి పోలవరం పూర్తి చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తెలిపారు. లోక్‌సభలో జలశక్తి శాఖ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్‌కి రిప్లైలో మంత్రి పలు విషయాలు వెల్లడించారు. ఈసందర్భంగా పోలవరం నిర్మాణంపై ఆయన స్పందించారు. అనేక ప్రభుత్వాలు వచ్చినా పోలవరం నిర్మాణానికి ఏమీ చేయలేదని.. ప్రధాని నరేంద్ర మోడీ రూ.15 వేల కోట్లు పోలవరానికి కేటాయించారన్నారు. దీనిలో భాగంగా ఈ ఏడాది రూ. 12 వేల కోట్లకు పైగా కేటాయించారని.. వచ్చే ఏడాది నాటికి పోలవరం పూర్తి చేసేలా నిర్ణయించామని తెలిపారు.
పోలవరం నిర్మాణం పూర్తయితే . 2.91 లక్షల ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని.. విశాఖ నగరం, మరో 540 గ్రామాలకు తాగునీరు లభిస్తుందన్నారు. ఈ నిర్మాణం జరిగితే 28.5 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు.