ఫిబ్రవరి 4వ తేదీన ఉర్దూ జబ్ మేళా..

హైదరాబాద్ (CLiC2NEWS): మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్డూ యూనివర్సిటీ (మను) ఆధ్వర్యంలో ఫిబ్రవరి 4న జాబ్ మేళా నిర్వహించనున్నారు. వచ్చే శుక్కవారం ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్ విధానంలో మొదటి తెలంగాణ ఉర్దూ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయం అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఈ జాబ్ మేళా జనవరి 6వ తేదీన నిర్వహించాల్సి ఉండగా కొవిడ్ కేసులు పెరుగుతున్న కారణంగా వాయిదా వేశారు.
మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మను)తో కలిసి తెంగాణ స్టేట్ ఉర్దూ అకాడమి, సెట్విన్ సెక్యూరిటి & మ్యాన్ పవర్ సర్వీసెస్, హైదరాబాద్ వీకర్ సెక్షన్ డెవలప్‌మెంట్ సొసూటి ఈ జాబ్ మేళాను సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.
జాబ్‌మేళా కోసం రిజిస్టర్ చేసుకున్న వారందరూ వివిధ కంపెనీల వారి రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి ఇంటర్వ్యూల కోసం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండాలని విశ్వవిద్యాలయం ఇన్‌ఛార్జి తెలియజేశారు.
ఈ జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు పూర్తి చేసిన ప్రొఫార్మా, అండర్‌టేకింగ్‌లను ఫిబ్రవరి 3వ తేదీలోగా సమర్పించాలి