ఉస్మాన్‌సాగ‌ర్ 4 గేట్లు మూసివేత‌

హైదరాబాద్‌ (CLiC2NEWS): వ‌ర్షాలు త‌గ్గుముఖం ప‌ట్టడంతో జంట జ‌లాశ‌యాల‌కు వ‌ర‌ద ప్ర‌వాహం కూడా త‌గ్గుతోంది. దీంతో తెరిచిన జ‌లాశ‌యాల‌ గేట్ల‌ను క్ర‌మంగా మూసి వేయ‌డం జ‌రుగుతోంది. తెరిచి ఉన్న 6 ఉస్మాన్‌సాగ‌ర్ రిజ‌ర్వాయ‌ర్ గేట్ల‌లో 4 గేట్ల‌ను ఇవాళ‌(గురువారం) సాయంత్రం 5 గంట‌ల‌కు మూసివేశారు. ప్ర‌స్తుతం 2 గేట్ల నుంచి 700 క్యూసెక్కుల‌ నీటిని మూసీలోకి వ‌దులుతున్నారు. కాగా, ప్ర‌స్తుతం 800 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొన‌సాగుతోంది.

హిమాయ‌త్‌సాగ‌ర్‌:
హిమాయ‌త్‌సాగ‌ర్‌కు సంబంధించి తెరిచి ఉన్న 2 గేట్ల ఎత్తును 2 ఫీట్ల నుంచి ఒక ఫీటుకు త‌గ్గించ‌డం జ‌రిగింది. ప్ర‌స్తుతం 2 గేట్లను ఒక ఫీటు ఎత్తుకు తెరిచి 700 క్యూసెక్కుల నీటిని మూసీ న‌దిలోకి వ‌ద‌ల‌డం జ‌రుగుతోంది. కాగా, ప్ర‌స్తుతం 800 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొన‌సాగుతోంది.

ఉస్మాన్ సాగర్:

  • ఇవాళ‌(గురువారం) సాయంత్రం 5 గంట‌ల‌కు
  • ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం : 1790.00 అడుగులు
  • ప్రస్తుత నీటి స్థాయి : 1790.00 అడుగులు
  • రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం : 3.900 టీఎంసీ లు
  • ప్రస్తుత సామర్థ్యం : 3.900 టీఎంసీ లు
  • ఇన్ ఫ్లో: 800 క్యూసెక్కులు
  • అవుట్ ఫ్లో: 700 క్యూసెక్కులు
  • మొత్తం గేట్ల సంఖ్య: 15 గేట్లు
  • ఎత్తిన గేట్ల సంఖ్య: 2 గేట్లు 3 ఫీట్ల ఎత్తుకు

# ఇవాళ సాయంత్రం 5 గంట‌ల‌కు 4 గేట్లు మూసివేయ‌డం జ‌రిగింది.

హిమాయత్ సాగర్:

  • ఇవాళ‌(గురువారం) సాయంత్రం 5 గంట‌ల‌కు
  • హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం : 1763.50 అడుగులు
  • ప్రస్తుత నీటి స్థాయి : 1763.45 అడుగులు
  • రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం : 2.968 టీఎంసీ లు
  • ప్రస్తుత సామర్థ్యం : 2.949 టీఎంసీ లు
  • ఇన్ ఫ్లో : 800 క్యూసెక్కులు
  • అవుట్ ఫ్లో: 700 క్యూసెక్కులు
  • మొత్తం గేట్ల సంఖ్య: 17 గేట్లు
  • ఎత్తిన గేట్ల సంఖ్య: 2 గేట్లు 1 ఫీటు ఎత్తుకు.

# ఈ సాయంత్రం 5 గంట‌ల‌కు తెరిచి ఉన్న‌ 2 గేట్లను 2 ఫీట్ల నుంచి 1 ఫీటుకు త‌గ్గించ‌డం జ‌రిగింది.

Leave A Reply

Your email address will not be published.