ఉస్మాన్‌సాగర్ మరో రెండు గేట్లు ఎత్తివేత

హైదరాబాద్ (CLiC2NEWS): ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉస్మాన్‌సాగర్(గండిపేట) జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. ఇప్పటికే జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. ఇప్పటికే 23వ తేదీన(23.09.2021) రెండు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదలడం జరుగుతోంది. ఇవాళ(27.09.2021) మధ్యాహ్నం 2 గంటలకు మరో రెండు గేట్లను ఎత్తడం జరిగింది. దీంతో ప్రస్తుతం మొత్తం నాలుగు గేట్లను ఒక అడుగు మేర ఎత్తి 480 క్యూసెక్కుల నీరు మూసీ నదిలోకి వదులుతున్నారు. ప్రస్తుతం ఉస్మాన్‌సాగర్ (గండిపేట) జలాశయానికి 350 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది.