నేడు మంచిర్యాల హైటెక్ సిటీ లో వ్యాక్సినేషన్..

మంచిర్యాల (CLiC2NEWS): తెలంగాణ సర్కార్ ఆదేశాల మేరకు వైద్య, మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో ఇవాళ (శుక్రవారం ) మంచిర్యాల పట్టణంలోని 29వ వార్డు హైటెక్ సిటీ ఎంట్రన్స్ వద్ద కార్యాలయంలో ఉదయం 10 గంటల నుండి కరోనా (Covid) వ్యాక్సిన్ వేయనున్నారు. ఈ మేరకు 29 వార్డు కౌన్సెలర్ చైతన్య సత్యపాల్ రెడ్డి మీడియాకు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య, మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో ఇవాళ (శుక్రవారం ) మంచిర్యాల పట్టణంలోని 29వ వార్డు హైటెక్ సిటీ లో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ ను అందరూ వినియోగించుకోవాలని కోరారు. కరోనా ఇంకా ముగియలేదని తెలిపారు. థర్డ్ ముప్పు ముంచి ఉన్నదని నిపుణులు సూచిస్తున్న నేపథ్యంలో 18 సంవత్సరాలు నిండిన వారందరూ తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా ఆయన తెలిపారు.