Vaccine: ఇకపై సెక్యూరిటీ కోడ్ చెప్తేనే ఇస్తారు..

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. మహమ్మారి నుంచి తప్పించుకునేందుకు టీకా ఒక్కటే మార్గంగా కనిపిస్తోంది. దీంతో దేశంలో అందుబాటులో ఉన్న టీకాల క ఓసం ప్రజలు పెద్ద ఎత్తున పోటీపడుతున్నారు. టీకాల పంపిణీ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించేకు ఇకపై నాలుగు సంఖ్యల సెక్యూరిటీ కోడ్‌ను కేంద్రం తప్పనిసరి చేసింది. వ్యాక్సినేషన్ కోసం cowin.gov.in వెబ్‌సైట్‌లో స్లాట్ బుక్ చేసుకున్న కొందరికి వ్యాక్సిన్ వేయించుకున్నట్లుగా మెసేజ్ వస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలో డేటా ఎంట్రీ లోపాలను సరి చేసేందుకు కొత్తగా నాలుగు అంకెల సెక్యూరిటీ కోడ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టినట్లు శుక్రవారం పేర్కొంది.
టీకా కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారి మొబైల్ నంబర్‌కు నాలుగంకెల కోడ్ వస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వ్యాక్సినేషన్ సెంటర్‌లో ఈ సెక్యూరిటీ కోడ్‌ను చూపించాల్సి ఉంటుందని పేర్కొంది. కరోనా టీకా వేయించుకున్న తర్వాత ఇచ్చే స్లిప్ ( డిజిటల్ సర్టిఫికెట్)లో కూడా ఈ సెక్యూరిటీ కోడ్ నంబర్ ఉంటుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ విధానం వల్ల రిజిస్ట్రేషన్‌లో తప్పులు, మోసాలను నివారించడంతోపాటు అధిగమించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది.