ఈ నెల‌లో ఎన్నిడోసులు అందుబాటులో ఉండ‌బోతున్నాయంటే…

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారిని ఎదుర్కొడానికి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను ముమ్మ‌రం చేశాయి. అయితే జూలై నెల‌లో దేశంలో ఎన్ని డోసులు అందుబాటులో ఉంటాయ‌నే దానిపై కేంద్ర స‌ర్కార్ విర‌ణ ఇచ్చింది. ఈ నెల‌లో 12 కోట్ల డోసులు అందుబాటులో ఉంటాయ‌ని, ప్రైవేట్ వ్యాక్సిన్లు దానికి అద‌నం అని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ పేర్కొన్నారు. ఏ రాష్ట్రానికి ఎన్నెన్ని డోసులు అందిస్తున్నామో ఖ‌చ్చిత‌మైన లెక్క‌లు ఉన్నాయ‌ని అన్నారు. గ‌త నెల‌లో 11 కోట్ల‌కు పైగా డోసులు రాష్ట్రాల‌కు ఉచితంగా అందించిన‌ట్టు మంత్రి పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.