ఘాట్‌రోడ్డులో ప్రమాదానికి గురైన వాహనం.. 47 మందికి గాయాలు
నార్నూర్ (CLiC2NEWS): దైవదర్శనానికి వెళుతున్న యాత్రికుల వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 47 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం మాలేపూర్ ఘాట్ రోడ్డులో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్నపోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. 60 మంది యాత్రికులతో కెరమెరి మండలంలోని జంగుబాయి ఆలయానికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. వీరంతా గుడిహత్నూర్ మండలం సూర్యగూడ గ్రామ ఆదివాసీలుగా గుర్తించారు. గాయాలైన వారిని ప్రైవేటు వాహనాల్లో సమీప ఆస్పత్రులకు తరలించారు.