విజయవాడ: ఎగ్జిబిషన్‌లో అగ్నిప్రమాదం
![](https://clic2news.com/wp-content/uploads/2025/02/fire-accident-in-vijayawada.jpg)
విజయవాడ (CLiC2NEWS): నగరంలోని సితార సెంటర్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. అక్కడ కశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్‌లో ఒక్క సారిగా మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగ వ్యాపించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు ఫైరింజన్లతో సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గ్యాస్ సిలెండర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.