విజయుడు (ధారావాహిక న‌వ‌ల‌ పార్ట్‌-5)

నేను ఎలా చనిపోయాను, ఆ వెంటనే మీకు సమాచారం ఎలా తెలిసింది? ఆఘమేఘాల మీద, మీరు ఈ ప్రాంతానికి ఎలా రాగలిగారంటూ తన మనస్సులోని సందేమాన్ని వారి ముందుంచారు. దీనికి వారు సమాధానం ఇస్తూ..

సర్వలోకాల్లో ఏమి జరుగుతున్నదో మేం దివ్యదృష్టితో చూడగలం. ఎక్కడికైనా మనో వేగంతో చేరుకోగలం..తీరినిదా, నీ సందేహం అంటూ ఎదురు ప్రశ్న రావడంతో విజయ్ మౌనం వహించాడు.

ఈలోగా జీవిని తోడ్కొని దైవ దూతలు వైకుంఠం చేరుకొని ద్వారం ముందు నిలిచారు. అక్కడ ఉన్న ద్వారపాలకులు జయ, విజయలు సమాచారం తెలుసుకొని శ్రీ మహా విష్ణువు సమక్షంలోకి ఈ జీవిని తోడ్కొని వెళ్లారు.

పాల సముద్రంలో శేషశయ్యపై పవళించి ఉన్న శ్రీమన్నారాయణనుని దివ్య మంగళ రూపాన్ని చూసి విజయ్ పులకించపోయారు. చెంతనే ఉన్న మహాలక్ష్మిని దర్శించారు. ముకిలిత హస్తుడై నిలబడిన విజయ్ వైపు ప్రసన్నంగా చూస్తూ మహామహులకే లభించని మా సాక్షాత్కారం నీకు లభించినా… ఏమది నీ ముఖంలో అసంతృప్తి ఛాయలు గోచరిస్తున్నాయంటూ? ఆ దేవదేవుడు ప్రశ్నించడంతో విజయ్ బిత్తరపోయారు.

మీ దర్శన భాగ్యంతో పులకించి పోతున్నాను స్వామి. ఇంకా నాకు అసంతృపి ఏమిటి స్వామి.. జపతపము, హోమాలు, దాన ధర్మాలు, ఎన్ని సత్కార్యాలు చేసిన భూలోకంలో మానవులు కోరుకునేది ఈ సౌభాగ్యమేగా, మీ దర్శన భాగ్యమేగా, నారాయణ, నారాయణ. ఇంకా నాకేమి కావాల్సి ఉంటుంది మీరే చెప్పండి అని శ్రీమన్నారాయణున్ని కీర్తిస్తూ తదేకంగా చూస్తూ నిలబడిపోయాడు.

నిజమే కానీ.. నీ ముఖకవలికలు అందమైన అబద్దం చెబుతున్నట్లుగా ఉంది నాకు… మహా విష్ణువు ప్రస్తావించారు.

శీమన్నారాయణుడే స్వయంగా అలా ప్రశ్నించడంతో విజయ్‌కు ఏమి మాట్లాడాలో పాలుపోలేదు.

భూలోకంలో జన్మించిన ప్రతి జీవికి అంతిమ ఆశయం మీ దర్శనమే. ఇది ఏ అతికొద్ది మందికో సాధ్యం కాదని నాకు తెలుసు దేవా… కానీ… కానీ నాకు వచ్చిన సందేశం వింటే మీరు అన్యథా భావిస్తారేమో అనే దిగులు నన్ను పీడిస్తున్నది. అందుకు ఆ ప్రస్తావన తేవడం లేదు. జన్మలేని సార్థకత మీ దర్శనంతో, వైకుంఠ ప్రవేశంతో నాకు ఒనకూడింది. అయినా నాలో ఏదో అసంతృప్తి ..దీనికి కారణం కూడా పెద్దదేమి కాదు దేవాదిదేవ.. పైగా అది ఇక అప్రస్తుతమనే మీకు నివేధించడం లేదు.

మానవా.. నీవు చెప్పకపోయినప్పటికీ నాకు తెలియదునుకుంటున్నావా? నీ ముఖ:తనే వినాలని అలా ప్రశ్నించాను.

లేదు దేవా.. ఈ వైకుంఠ ప్రవేశం తర్వాత నా గతం అంతా మరిచిపోతాను. మీ దర్శన భాగ్యంతో మిమ్ముల్నే ఎళ్లవేలలా ఇక్కడ ఉంటున్న సువర్ణావకాశం ముందు భూలోకంతో ఇక సంబంధం కొనసాగించే ఆలోచననే విరమించుకుంటున్నాను స్వామి అంటూ విజయ్ పదేపదే విష్నువును నమస్కరిస్తూ నిలుచున్నారు. ఇంతలో మహా లక్ష్మి జోక్యం చేసుకుంటూ… ఈ మానవుడు చాలా లౌక్యంగా మాట్లాడుతున్నాడు. లేదు లేదంటూనే తన భూలోక ప్రస్తావన తెస్తున్నాడు స్వామి.. ఏదో నిగూడ సమస్యతో జీవి మథనపడుతున్నాడని పేర్కొనడంతో ఏమంటావ్ అన్నట్లుగా ఆ నారాయణుడు, విజయ్ వైపు చూశారు.

లక్ష్మిదేవి… భూలోకంలో అందరూ నిన్నే ఎక్కువగా ధ్యానిస్తున్నారు. సిరిసంపధలతో తులతాగాలనే పేరాశతో అనేక మంది నీకు మొక్కులు చెల్లిస్తున్నారు. రాజకీయ నాయకులు, ఎక్కువ మంది అధికారులు, వ్యాపారస్తులు అనేకులు వీలైనన్ని అడ్డదారులు తొక్కుతూ లక్ష్మి కటాక్షం కోసం ఆరాటపడుతున్నారు. కోట్లు కూడ బెడుతున్నా వారిలో సంతృప్తి కనిపించడం లేదు తల్లీ… వారి ధన దాహానికి అడ్డు అదుపు లేదు. ఇతర దేశాల్లోని బ్యాంకుల్లో తమ సంపాధనను దాచిపెట్టుకొని స్వదేశానికి ద్రోహం ప్రభుత్వంలో ఎవరున్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా, అవినీతిని అరికడతాం… అక్రమార్కుల భరతం పడతామంటుందే కానీ ప్రాక్టికల్‌గా చేసింది ఏమీ కనిపించదు.

సామాన్య ప్రజలకు అందించాల్సిన సంక్షేమ కార్యక్రమాలకు బడ్జెట్‌లలో భారీగా నిధుల కేటాయింపులు కనిపిస్తున్నప్పటికీ వాటి అమలులో ఇరవై శాతం కూడా పేదలకు అదడం లేదని దేశ ప్రధాని సీటులో ఉన్న నేతలే అంగీకరిస్తున్నారు. ఈ ఎనభై శాతం ఎవరు బొక్కుతున్నారో బహిరంగ రహస్యమే అయినా ఎవరు పెదవి ఇప్ప‌రు. చట్టసభల సభ్యులలో కొందరికి భారీగా వాటాలు లభిస్తుండటంతో కనీస చర్యలుండటం లేదు. ఈ సభ్యులు తిరిగి ఎన్నిక కావడానికి ఖర్చు చేస్తారనుకుంటూ ముఖ్యమంత్రులు మౌనంగా ఉంటున్నారు. పైగా సింహ భాగం సిఎంల‌కే చేరుతున్నది..

ప్రచార సాధనాల్లో వచ్చే అవినీతి వార్తలపై తప్పదనుకుంటూ సస్పెన్షన్‌లు, వార్నింగ్‌లు ఇతర తాత్కాలిక చర్యలతో కాలం వెల్లదీస్తున్నారు. దీనికి ఏ ఒక్క రాష్ర్టం మినహాయింపు కాదు మాతా… అంటూ ఆవేశంగా విజయ్ తన జర్నలిస్టు అనుభవంతోపాటు మూడేళ్ల కాలంలో అసెంబ్లీలో చేసిన ప్రసంగాల అనుభవాలన్నింటినీ ఉపయోగించుకుంటూ వాటి సారాంశాలను ఉటంకించే ప్రయత్నం చేశాడు విజయ్.

భూలోకంలో మీ అవతారాలపై జనం ఇప్పటికీ ఎన్నో కథలుగా చెప్పుకుంటారు. ఎందరో గానం చేస్తున్నారు మీ లీలలను. ముఖ్యంగా కృష్ణావతారంపైనే ఎక్కువ మంది చర్చోపచర్చలు సాగిస్తుంటారు. మహా భారతంలో ఉన్న పాత్రలన్నీ మాకు ప్రస్తుతం భూలోకంలో సాక్షాత్కరిస్తున్నాయంటే నమ్మాలి మీరు… ఎంతో చనువు తీసుకొని విజయ్ ప్రస్తావించారు ఈ విషయాలను..

అవునా ఏమంటున్నారో వివరంగా చెప్పు అంటూ శ్రీమన్నారాయణుడు ఆసక్తి చూపడంతో విజయ్ తన సందేహాలన్నింటిని దేవదేవుని ముందు పెట్టాలని తలపోస్తున్నాడు.

సందేహాలు వద్దు నిర్భయంగా మాట్లాడు మానవా అంటూ లక్ష్మీ దేవి కూడా అనుజ్ఞ ఇవ్వడంతో విజయ్‌కు భయాందోళనలు తగ్గిపోతున్నాయి.

భూభారాన్ని తగ్గించాలని, జనాభాను నియంత్రించాలనే తలంపుతోనే కదా స్వామి మీరు సోదరుల మధ్య జరిగిన యుద్ధంలో పాండవ పక్షపాతిగా వ్యవహరించారు…

లక్ష్మీ దేవి ఆగ్రహంగా చూడటంతో.. అమ్మా నేను సినిమాలు, విన్న కథలు, చదివిన గ్రంథాలు, పెద్దలు చెప్పిన విషయాలను క్రోఢీకరించి మాత్రమే మాట్లాడుతున్నాను. మీరు కోపం ప్రదర్శిస్తే నేను ఏమీ మాట్లాడను. పక్షపాతిగా ఉండి పాండవులకు విజయం చేకూర్చి పెట్టారనేది లోకనీతి. పాండవ పక్షపాతి అనగానే మీరు కోపంగా చూశారు అమ్మా… ఇది చెప్పవద్దంటే మౌనంగా ఉంటా అన్నాడు విజయ్..

దేవీ చెప్పనీ ఆ జీవిని… మనం విందాం, లోకంలో ఏమనుకుంటున్నారో.. మరో అభిప్రాయాన్ని తెలుసుకోవడం మంచిదే అని మహా విష్ణువు జోక్యం చేసుకున్నారు.
చెప్పు ఇంకా ఏమంటున్నారు…

ఇది నా సందేహమే…జనం ఎక్కడ అనలేదేమో…

ఏమిటది..

రారాజు దుర్యోదునుడు పరిపాలనలో ఎక్కడా తప్పులు చేసినట్లుగా ఏ సందర్భంలోనూ నాకు తెలియలేదు. దాయాదులపై పగ, తనను చూసి నవ్విందని ద్రౌపదిపై ప్రతికారం తప్ప నేరుగా సుయోధనుడు చేసిన నేరాలు ఇవే కదా… సామ, దాన, భేద, దండోపాయాలు, ఇవే నాలుగు ఉపాయాలతో శత్రువులను జయించవచ్చనే అభిప్రాయంతో రారాజు తన పదవిని పదిలం చేసుకునేందుకు ఈ దుశ్చర్యలకు పాల్పడి ఉంటాడు. అని భూలోకంలో అంటుంటారు… రుణ శేషం, శత్రు శేషం ఉండరాదని, అందుకే పాండవులను తుదముట్టించానే దుర్యోధనుడు అన్నిఎత్తుగడలు వేసి ఉంటారు కదా స్వామి..

సావధానంగానే వింటున్నారు మహా విష్ణువు..

ధర్మరాజు జూదం అడకుండా ఉండి ఉంటే ఈ సమస్యలేవీ వచ్చి ఉండేది కాదు కదా… పైగా రారాజు జూదం ఆడలేదు. శకునిని ముందుంచాడు. రెండోసారి వచ్చి మ‌ళ్లీ జూదం ఆడిన ధర్మరాజుదే ఎక్కువ తప్పు అని మా లోకంలో చాల మంది అంటుంటారు. జూదం  ఇప్పటికీ మాలోకంలో ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా దానిని అరికట్టడం సాధ్యం కావడం లేదు..

ఆసక్తిగా ఉంటున్నది ఇంకా వివరించూ అంది మహా లక్ష్మిదేవి.

పరిపాలనాధ‌క్షుడుగానే దుర్యోధనునికి పేరు ఉందని, ఆయన ఏలుబడిలో ఎక్కడా ప్రజలు ఇబ్బందులు పడినట్లుగా కథనాలు లేవనేది మరో చర్చ… అయితే భూలోకంలో కౌరవులు, వారికి అండగా ఉన్న వారందరూ చనిపోతే జనాభా తగ్గి, భూదేవికి భారం ఉండదనే శ్రీకృష్ణుడు ఇదంతా చేసినట్లుగా చెబుతుంటారు. పాండవుల ఒక్క భీష్ముని భాణాలకే లక్షల మంది హతులయ్యారు కాబట్టి, రెండు వైపుల జన నష్టం జరిగి, దేవదేవుని లక్ష్యం నెరవేరిందనేది లోకనానుడి.

అయిపోయిందా ఇంకా అంటూ లక్ష్మిదేవి అడగడంతో…

లేదమ్మా, స్వామికి తెలియనది ఏముంది, ఏదో నా ఆజ్ఞానంతో కొన్ని విషయాలు ప్రస్తావించాను..కానీ గజేంద్ర మోక్షం ఘట్టం మాత్రం నాకు నచ్చలేదు తల్లీ..

ఏమిటి? అట్లాగా…

మహాకవి పోతన ఎంతో పవిత్రంగా రాసిన మహాభాగవతంలో శ్రీమన్నారాయణుడు ఆర్తపరాయణ రక్షకుడుగా కొలనులోని మొసలికి చిక్కిన గజేంద్రున్ని రక్షించేందుకు కదలిన మహావిష్ణువు గురించి రాసిన పద్యం మా తెలుగు ప్రజల నాలికపై ఎప్పటికీ నడయాడుతుంటున్నది దేవీ..

ఆసక్తిగా వింటున్నారు వారిద్దరు.

సిరికింజెప్పడు, శంఖచక్రం కూడా తీసుకోకుండా గజేంద్రున్ని కాపాడటానికి పరుగులు తీస్తున్నట్లుగా మహావిష్ణువు అంతరంగాన్ని పోతన కవీంద్రుడు అద్భుతంగా వర్ణించాడు తల్లీ..

అయినా స్వామి నాకు ఇక్కడో అనుమానం.

ఏమిటన్నట్లుగా తలపంకించారు నారాయణుడు.

మొసలి నివాసం ఉండే కొలను కావచ్చు, సరస్సు సముద్రం కావచ్చు… దానికి ఆహారం తన ప్రాంతానికి వచ్చే వాటిని వేటాడి భుజించడం. ఇందులో భాగంగానే తనకు దొరికిన గజేంద్రుని కాలుపట్టుకొని నీళ్లలోకి తీసుకువెళ్లి తినాలనేది ఆ మొసలి ఉద్ధేశ్యం. కాపాడుకోవడానికి ఆ ఏనుగు ఎంతో శ్రమపడింది. ఇక తనకుచేత కాదని తెలిసిన తర్వాత మాత్రమే మీరు గుర్తుకు వచ్చారు, మీరు తప్ప ఇక ఎవరు రక్షించలేరని ప్రార్థించింది.. మీరు వెంటనే వెళ్లి మొసలిని చంపి, గజేంద్రున్ని రక్షించారు. దీంతో ఆప‌ద‌లో ఉన్న భక్తులను మీరు తప్పక రక్షిస్తారనే ఘన కీర్తి వచ్చింది. ఇదే గజేంద్రమోక్ష ఘట్టం. కానీ దేవాదిదేవా ఆ మొసలి చేసిన తప్పు ఏమిటో సామాన్యులకు అర్థం కావడం లేదు.

మొసలి పూర్వజన్మ ఉప కథతో ఈ ఘట్టాన్ని సమర్ధించారు కవులు.. ఆ గందర్వునికి ఈ విధంగా శాపవిముక్తి కలిగింది. కానీ అజ్ఞానులకు కూడా అనుమానాలు రాని విధంగా గ్రంథ రచన సాగితే సమంజసంగా ఉంటుందేమో స్వామి.. తప్పుగా మాట్లాడితే అంటూ చెంపలు వేసుకున్నాడు విజయ్.

దేనికదే చెప్పాలి స్వామి, ఈ ఘట్టం భూలోకంలో అధిక ప్రాచూర్యంలోకి వచ్చింది. కానీ సహజ న్యాయ సూత్రాలు పాటించలేదనే అనుమానాలున్నాయి

ప్రకృతి నియమం ప్రకారమే మొసలి వ్యవహరించింది కూడా.. తన కొలనులోకి వచ్చిన ఏ జంతువును అయినా వేటాడే అవకాశం అందులో నివసించే ప్రాణికి ఉంటుంది. లేదా కొలనులో ఉన్న ప్రాణులను సహితం ఇతరులు వేటాడటానికి వీలుంటుంది. జాలర్లు చేపలు వలవేసి పట్టుకుంటారు. ఉన్న పాములు తమకు హాని జరుగుతుందని భావిస్తే తమ వద్దకు వచ్చిన వారిని కాటు వేస్తాయి. మొసలి కూడా తన ఆహారం కోసం అందివచ్చిన వాటిని పట్టుకొంటుంది.

ఈ జీవన చక్రంలో మొసలి తనకు లభించిన గజేంద్రున్ని పట్టుకుంది. ఆహారంగా దానిని కొలనులోకి తీసుకుపోవడానికి శతవిధాలుగా ప్రయత్నించింది. దీనిలో మొసలి తప్పు ఏమి కనిపించడం లేదు. గజేంద్రుడు… మొసలి సుదీర్ఘ పోరాటం చేయడంతో అలసిపోయిన గజేంద్రుడు ఇక తన మొసలిని వదిలించుకోలేనని భావించి ఇక తప్పని పరిస్థితిలోనే మిమ్ములను ధ్యానించారు కదా స్వామి. తలచినదే తడవుగా మీరు మనో వేగంతో వెళ్లి మొసలిని సంహరించి, ఏనుగును కాపాడారు. మొసలి పూర్వ జన్మలో గందర్వుడని, శాప విమోచనకే మీరు ఈ మొసలిని సంహరించారనేది ఈ ఘట్టంలో ఉప కథయే కానీ సహజ న్యాయ సూత్రాలకు ఇది ఎందుకు విరుద్దం కాదో నాకు అర్థం కావడం లేదు.. అయితే భక్తవత్సలుడుగా మాత్రం మీకు ఈ ఘట్టంతో ఎనలేని కీర్తి వచ్చింది కదా స్వామి.. అంటూ ఈ ఉదంతాన్ని శ్రీమన్నారాయణుని ముందుంచాడు విజయ్.

త‌ప్ప‌క‌చ‌ద‌వండి episode -4: విజయుడు (ధారావాహిక న‌వ‌ల‌ పార్ట్‌-4)

 

Leave A Reply

Your email address will not be published.