విజయుడు (ధారావాహిక నవల పార్ట్-51)

ముఖ్యమంత్రిగా భాద్యతల స్వీకరణ
పార్టీని ఒంటిచేత్తో నడిపించి,అఖండ మెజారిటీ సాధించిన విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో రాష్ట్ర ప్రజలు పండుగ జరుపుకున్నారు. రాజ్‌భవన్‌లో కాకుండా ప్రత్యేకంగా అలంకరించిన మైదానంలో సుమారు రెండు లక్షల మంది సమక్షంలో విజయ్ ఈ కార్యక్రమం నిర్వహించుకున్నారు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఈ మహాత్సవం ఒక మైలురాయిగా నిలిచి ఉంటుంది. ఢల్లీి నుంచి వచ్చిన పార్టీ ప్రముఖలతోపాటు మాజీ ముఖ్యమంత్రి జానకి రామయ్య, అన్నపూర్ణమ్మ, విరంచి, ఆమె తల్లిదండ్రులు, ఇతర పార్టీల నేతలు కూడా విజయ్ ప్రత్యేకంగా ఆహ్వానించారు.
కొత్త ముఖ్యమంత్రి కోసం బంగ్లా ఖాళీ చేయాలని ముఖ్యమంత్రిగా పదవి నుంచి తప్పుకుంటున్న బయ్యన్న గారి జానకిరామయ్య (బిజెఆర్) నిర్ణయించుకోవడంతో విజయ్‌కు సంకటస్థితి ఏర్పడిరది. బిజెఆర్ మనస్సు అల్లకల్లోలంగా ఉంది. పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడు. అయితే అన్నపూర్ణమ్మ తన వద్దనే ఉండాలని విజయ్ ఆకాంక్షిస్తుండగా ఆయన అంగీకరించ లేదు. వారిద్దరిని ఒప్పించేందుకు విజయ్ అధిక శ్రమ పడాల్సి వచ్చింది. అందరం కలిసే ఉందామని ఎన్నో విధాలుగా ఆయన ఒప్పించాడు. బంగ్లాలో అందరు కలిసి ఆనందంగా గుడుపుతుండగానే…తర్వాత నాలుగు రోజులకే మరో అవాంతం వచ్చిపడిరది.
కొత్త ముఖ్యమంత్రితో డిజిపి సమావేశమయ్యారు. విజయ్ హత్యా ప్రయత్నం కేసులో నింధితులను, కుట్రదారులను అరెస్టు చేయనట్లయితే పోలీసు శాఖకు పెద్ద అప్రతిష్ట వచ్చిపడుతుందని సిఎం పర్మిషన్ అడిగారు డిజిపి. గతంలో వారించినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఇంకా ఆ కేసును జాప్యం చేయలేమని వివరించడంతో అంగీకరించక తప్పలేదు విజయ్‌కు.ఇంటలిజెన్స్ ఐజికే మాజీ సిఎం ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తూ ఈ కుట్రకు పాల్పడినట్లుగా డిజిపి చెప్పారు. దీంతో కాల్పులకు తెగబడిన ఇద్దరిని,ఆ ఐజి, మాజీ సిఎం జానకి రామయ్యను అరెస్టు చేస్తున్నామని తెలిపారు డిజిపి.
మర్నాడు వారంట్‌తో సిఎం బంగ్లాకు వచ్చిన పోలీసు అధికారులు జానకి రామయ్యను అరెస్టు చేశారు. ఎందుకు అరెస్టు చేస్తున్నారంటూ అన్నపూర్ణమ్మ ఘొల్లుమంది. మా ఆయన ఏమి తప్పు చేశారంటూ పోలీసులకు అడ్డుగా నిలబడిరది. విషయం తెలిసిన అన్నపూర్ణమ్మ నివ్వెరపోయింది. వినకూడనిది విన్నట్లుగా విలవిలలాడిరది. విజయ్‌ను హత్య చేయడానికి రెండుసార్లు ప్రయత్నించాడని పోలీసులు వారంట్ చూపడంతో నిశ్చేష్టురాలైంది ఆమె. నిజమేనా, అంటూ భర్తను తర్వాత నీకంతా తెలుసా అంటూ అక్కడే ఉన్న విజయ్‌ను చూపులతోనే అడిగింది. ఇద్దరూ తలూపడంతో అయ్యో ఎంతపని జరిగింది అంటూ బోరున విలపించింది.
స్వంత కొడుకుగా తాను చూసుకుంటున్నా విజయ్‌నే చంపిచేందుకు మీ మనస్సు ఎలా ఒప్పుకుంది? ఇంత రాజకీయ కుట్రనా..మీకు ఈ దురాలోచన ఎలా పుట్టిందని భర్తను నిలదీసింది. అందుకేనా వీలునామా రాయించడానికి అంత ఆలస్యం చేశారంటూ ప్రశ్నించింది.
విరంచికి, విజయ్‌కు వివాహం చేసి అందరం సంతోషంగా ఉండాలని నేను తలపోస్తుంటే ఎందుకు ఈ దారుణానికి పాల్పడినారని, వారసులు లేని మనకు ఒక ఆధారంగా విజయ్ లభిస్తే, మీరు చేసిందేమిటని.. భర్త మీదపడి రోధించింది.
ఆమెను ఓదార్చడం విజయ్‌కు తలకుమించిన భారమే అయింది. ఒరే బాబు నీకు ఎంతటి అపకారం తలపెట్టాడురా ఆయన. నీ వంటే ఎంతో అనురాగం
ఒలకబోసే వాడురా నా ముందు. నీకు గోతులు తవ్వుతున్న విషయం నాకు తెలియదురా విజయ్,తలకొట్టుకుంటూకంటికి ఏకదారగా ఏడుస్తున్నది. నిన్ను దత్తత తీసుకోవడానికి ఒప్పుకోక పోయినా, మాకు వారసునిగా నిన్ను నామినేట్ చేసుకుంటూ, తన తదనంతరం మొత్తం ఆస్తిపాస్తులు నీకు చెందేలా ఇప్పటికే వీలునామా రాసారు బాబు. నీవు ముఖ్యమంత్రి అయిన రోజునే ఆ పత్రాలు నాకు ఇచ్చి రెండు విధాలుగా నాకు సంతోషం కలిగించాడురా మీ సార్. ఇప్పుడు ఆయన జైలుపాలవుతున్నాడు.ఇక నేను ఒంటరినయ్యాను రా బాబు, ఇంకా నేను ఎవరి కోసం బతకాలిరా? అంటూ శోకసముద్రంలో ఉండిపోయింది ఆమె.
ఈ విషయం తెలిసి విరంచి కూడా అక్కడకు వచ్చింది. ఇద్దరు ఒకరినొకరు ఆలింగనం చేసుకొని బోరుమన్నారు. ఈ పరిస్థితిలో తాను ఏమి చేయాలో తోచక ఇద్దరిని చూస్తూ ఉండిపోయాడు విజయ్.
కోర్టులో విచారణల తర్వాత కుట్రదారులు జానకి రామయ్య, ఐజిలతోపాటు ఇద్దరు నింధితులకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు.
ముఖ్యమంత్రి బంగ్లాలోనే ఉంటున్నది అన్నపూర్ణమ్మ. స్వంత కొడుకుగానే విజయ్‌ను చూసుకుంటున్నది. భర్తను చూడటానికి అప్పుడప్పుడు జైల్‌కు వెళ్లి వస్తున్నది.
భర్త విషయం విస్మరించరానిదే అయినప్పటికీ విజయ్‌ను తమ వారసునిగా భావిస్తూ సంతృప్తి వ్యక్తం చేసుకుంటున్న అన్నపూర్ణమ్మ, ఇక విజయ్ పెళ్లిపై దృష్టి సారించింది. ఈ మేరకు అతనిపై ఒత్తిడి పెంచింది. తానే స్వయంగా విరంచి ఇంటికి వెళ్లి పెద్దవాళ్లతో సంప్రదించింది.
విజయ్, ఆమె ప్రయత్నాలకు ప్రారంభంలో వద్దని గట్టిగానే వ్యతిరేకించారు. ప్రేమికులుగానే తామిద్దరం ఉండిపోతామని, ఇందుకు విరంచికి అభ్యంతరం లేదని ఆయన వాదించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి పెళ్లికాకుండా వయస్సులో ఉన్న ఆడమగ కలిసి ఉంటే సమాజం హర్షించదని, అన్నపూర్ణమ్మ
ఒకటికి పదిసార్లు చెప్పడంతో అంగీకరించక తప్పలేదు విజయ్‌కు…అయితే ఒక ఏడాదిపాటు ఈ పెళ్లి ప్రస్తావన వద్దని, ముఖ్యమంత్రిగా తన ముందున్న సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆమెకు వివరించి, ఒప్పించాడు విజయ్. పెళ్లికి ఒప్పుకున్నాడు అదే పదివేలు, కొంత ఆలస్యం అయినా పర్వాలేదనుకుంది అన్నపూర్ణమ్మ. అయినప్పటికీ విరంచికి కాల్ చేస్తూ తరుచుగా బంగ్లాకు పిలుస్తున్నది. ఆమె కళ్లెదుట కనిపిస్తూ ఉంటే విజయ్ మనస్సు ఇక మారదని,వీలైనంత త్వరంగా పెళ్లి చేసేందుకు వీలు కులుగుతుందని అన్నపూర్నమ్మ అభిప్రాయం. దీంతో ఎక్కువ సమయం విరంచి బంగ్లాలో లోనే ఉంటోంది. భర్త జైలు పాలు కాకుండా ఉండి ఉంటే
బంగ్లాలో అందరం ఎంతో సంతోషంగా ఉండిపోయావారని ఆమె ఆలోచిస్తున్నది.
అన్నపూర్ణమ్మ ఆలోచనలతోపాటు, బాధను కూడా పంచుకుంటున్నది విరంచి. భర్త గురించి ఆలోచనలు వచ్చిన ప్రతిసారి ఆమె కళ్లలో నీళ్లు ఉబికి వస్తున్నాయి. ముఖ్యంగా విజయ్‌ను చంపడానికి ఆయన ఎలా కుట్రపన్నారో ఆమెకు అర్థం కావడం లేదు. రాజకీయాల్లో పదవుల కోసం ఇంతగా దిగజారుతారా అని ఆమె ఆందోళన పడుతున్నది. ఇదే మాట విరంచితో అంది. అనేక పదవులు అనుభవించాడు, ఎంతో సంపాదించాడు, అయినా మనిషికి తృప్తి లేకపోతే ఇలాగే జరుగుతుందని నా భర్తయే మంచి ఉదాహరణ అంటూ చెప్పింది. ఇంత ఉన్నా ఏమి లాభం, నాకు వారసులు ఎవరు? మీరిద్దరు పెళ్లి చేసుకొని పిల్లపాపలతో ఉంటే సంతోషించాలని ఇద్దరం అనుకున్నాం. కానీ మీఇద్దరు ఎప్పటికీ ఇలాగే ఉంటారనే గ్యారంటీ ఏముంది, విజయ్ ఎప్పటికీ నాకు నీడ నిస్తాడా, అయినా వానితో నాకు ఉన్న బంధం, బంధుత్వం ఏమున్నది చెప్పు విరంచి, వాడి మనస్సు ఎప్పటికైనా మారదని ఏమిటి? నీకు కూడా ఇదే ప్రేమ ఎప్పటికీ ఉంటుందా ఏమో,నాజీవితం ఎలా ముగుస్తుందో అంటూ రోధిస్తున్న అన్నపూర్ణమ్మను ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు విరంచికి.
అది కాదమ్మా, మేం ఎప్పటికీ నీకు తోడుగానే ఉంటాం.. విజయ్ ఎవరనుకుంటున్నారు…మీకు చాలా దగ్గరి బంధుత్వమే..ఆమెను ఓదార్చే క్రమంలో విజయ్‌కు ఇచ్చిన మాట తప్పి, నోరు జారింది విరంచి.
ఆశ్యర్య పోయింది అన్నపూర్ణమ్మ. ఒక్కసారిగా తేరుకుంది. ఎంతో ఆతురతతో …ఏమన్నావు, విజయ్ మాకు బంధువు, దగ్గర బాంధవ్యమే ఉందా ఎలా… కాస్తా వివరించగా చెప్పు విరంచి, అది వినాలని నా మనస్సు తొందరచేస్తున్నది అంటూ ఒత్తిడి చేసింది, అన్నపూర్ణమ్మ.
చెప్పక తప్పలేదు విరంచికి, ఆల్బమ్స్ చూస్తూ తన తల్లిదండ్రులను విజయ్ గుర్తించాడు. మీ పెళ్లి ఫోటోలో మీ పక్కనే ఉన్నారు వాళ్లు. పెద్దనాన్న, పెద్దమ్మలు మీరని విజయ్ తర్వాత నాకు చెప్పాడు. జానకి రామయ్య గారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నందున విజయ్ ఈ విషయం బయటకు రావద్దని ఆనుకున్నాడు. ఇప్పుడు చెబితే కావాలని చెప్పినట్లుగా ఉంటుందని విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. మీకు చెప్పవద్దని, మరీ మరీ చెప్పి నా వద్ద మాట తీసుకున్నాడు కానీ…మీ పరిస్థితి చూసిన తర్వాత చెప్పక తప్పలేదు నాకు… అంది విరంచి.అయ్యో ఎంతపని జరిగింది. అందుకేనా మా బంధువుల గురించి విజయ్ గుచ్చిగుచ్చి అడిగాడు ఆరోజు…నేనే పిచ్చిదాన్ని, ఎందుకు అలా అడుగుతున్నాడో తెలుసుకోలేకపోయాను…వాడు ఆఫీసు నుంచి రానీ చెబుతా వాని పని అంటూ దీర్ఘాలు తీసింది అన్నపూర్ణమ్మ.
తర్వాతి రోజు జైలుకు వెళ్లి భర్తకు విషయం చెప్పడంతో ఆయన కంగు తిన్నాడు. ఇది నిజమా అని భార్యను ఒకటికి రెండు సార్లు అడిగాడు. అయ్యే ఎంతపని జరిగిందంటూ తన కుట్ర వల్ల ఎంతటి అనర్థం జరిగిందంటూ వాపోయాడు. అంతా మంచే జరుగుతుందని, విజయ్ అంతా చూసుకుంటాడు, మీకు పెరోల్ కూడా త్వరలో వస్తుందని విజయ్‌చెబుతున్నాడని మీరు బాధపడవద్దని మరీమరీ అన్నపూర్ణ చెప్పినా జానకి రామయ్య ఆందోళన తగ్గలేదు.ఆయన పరిస్థితి చూసి అన్నపూర్ణమ్మ కూడా తీవ్రంగా కలత చెందింది. మీరు తప్పు చేసినా సరిదిద్దుకునే అవకాశం వచ్చింది, మీరు యాదృచ్చికంగానే వీలునామా వాని పేరుమీద రాసారు కదా, అంతా సర్దుకుంటుంది మీరు ఇది మనస్సులో పెట్టుకోవద్దు అంటూ ఆమె ఆయన ఆందోళనను తగ్గించే ప్రయత్నం చేసింది. అయితే తాను ఎంత అన్నాయం చేసినా విజయ్ కోపం పెట్టుకోలేదని ఇద్దరు అనుకున్నారు. విజయ్ నన్ను చూడటానికి వస్తాడా అంటూ ఆవేధనగా ప్రశ్నిస్తున్న భర్తను ఆమె ఓదార్చింది. ఎన్నో విధాలుగా చెప్పి బంగ్లాకు వచ్చిన ఆమె విజయ్‌కు అన్ని విషయాలు చెప్పింది. దీంతో ఒకసారి తప్పక వెళ్లి కలుస్తాను, లేదా త్వరగా పెరోల్ వస్తే, పెద్దనాన్ననే ఇంటికి వచ్చి కొన్నాళ్లు మనతో ఉంటాడని, ఆయన ఆందోళన తగ్గుతుందని చెప్పాడు విజయ్.
మర్నాడు ఉదయమే జైలు నుంచి పిడుగు లాంటి వార్త వచ్చింది. తన సోదరుని కుమారున్నే తాను చంపించేందుకు కుట్ర చేసిన విషయం ఆయన కంటికి కునుకు రానీయండంలేదు. ఇంతటి ఘోరానికి ఎందుక పాల్పడిన నేను బతకడానికి వీలు లేదని మధనడుతున్నాడు. ఒంటరిగా కూర్చొని ఆలోచనలో మునిగిపోయాడు. భగవంతుని దయవల్ల విజయ్ ప్రాణాలతో ఉన్నాడు కానీ, జరిగిన దాడులు తిరిగి ఆయన బతికేందుకు ఎలాంటి అవకాశాలు లేకుండా జరిపించినవే. ముఖ్యమంత్రిగా ఉన్నానని ఎన్నిసార్లు పోలీసు అధికారిని ఆదేశించి ఈ పనిచేయించాను, ఇక్కడైతే తెలుస్తుందని ముందుగా ఢల్లీిలో మట్టుపెట్టించాను, ఎలా బతికి వచ్చాడో కానీ, మళ్లీ అసెంబ్లీ వద్దనే చంపేలా నేను పురమాయించాను కదా అనుకుంటూ పశ్చాత్తాపడుతున్నాడు. ఎన్నికలకు ముందే తెలుసినా విజయ్ కనీసం నావైపు శత్రుభావంతో చూడలేదు. పైగా తన బంగ్లాలోనే ఉండమన్నాడు. ఎంతటి ఔదార్యం అతనిది. అలాంటి వాన్ని నేను తుదముట్టించాలని అనుకున్నాను. పదవీ వ్యామోహంలో పడి ఎంతపని చేసానని హైరానా పడుతూ ఒక్కసారిగా కూలపడ్డాడు.మనో వేధన మరింతగా పెరుగుతున్నది. బిపి, షుగర్
లెవల్స్ పెరుగుతున్నాయని అతనికి తెలుస్తున్నది. తన గుండె చప్పుడు తనకే వినిపిస్తున్నది. జైల్ గోడల మధ్య తన జీవితం కడతేరబోతున్నదా? సహాయం కోసం ఎవరినైనా పిలువాలని అనుకుంటున్నా, నోటి నుంచి మాట బయటకు రావడం లేదు. అంతా అయిపోతున్నది. చేసిన తప్పుకు దేవుడే సరైనా శిక్ష విధిస్తున్నాడు. పూర్ణకు ఏ ఇబ్బంది ఉండదు, విజయ్ బాగా చూసుకుంటాడు ఈ తృప్తి చాలనుకుంటూ స్పృహ కోల్పోయాడు. ఎప్పుడు ప్రాణాలు పోయాయో తెలియదు కానీ తెల్లారిన తర్వాత జైలు గార్డు ఆయన పరిస్థితిని చూసి అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ లోగా డాక్టర్‌ను కూడా పిలిపించారు. కానీ అప్పటికే ప్రాణం పోయిందని తెలియడంతో ముఖ్యమంత్రి బంగ్లాకు సమాచారం ఇచ్చారు.
విజయ్ వెంటనే అన్నపూర్ణమ్మ వద్దకు వచ్చాడు. కళ్లలో నీరు సుడులు తిరుగుతున్నాయి. ఆమెకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు.
శవాన్ని తీసుకు రావడానికి అంబులెన్స్ అప్పటికే వెళ్లడంలో ఈలోగానే ఆమెకు వివరించి, ఓదార్చాలని నిర్ణయించుకున్నాడు విజయ్.
అమ్మా అంటూ ఏడుపు గొంతుతో పిలుస్తున్న విజయ్‌ను చూసి ఏమైంది అంటూ ఆమె ఆందోళనగా అడిగింది.
జైలులో పెద్దనాన్న అంటూ…ఆమె కాళ్లమీద పడిపోయాడు విజయ్, అయోమయంలో పడిపోయింది. పెద్దనాన్న గుండెపోటుతో చనిపోయాడంటూ బావురుమన్నాడు విజయ్, అంతే ఆమె కుప్పకూలిపోయింది. కన్నీరుమున్నీరు అవుతున్నది. అప్పటికే టివిల్లో వార్త రావడంతో విరంచి బంగ్లాకు చేరుకుంది. విజయ్, విరంచి ఆమెను పట్టుకొని కూర్చోబెట్టారు. సపర్యలు చేస్తున్నారు. పరిపరివిధాలుగా చెబుతూ ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారే కానీ వారికీ దుఖ్ఖం ఆగడం లేదు. ముగ్గురిదీ అదే పరిస్థితి. ఈ లోగా శవం వచ్చింది. ఘొల్లుమన్నారు ముగ్గురూ..
విజయ్ చితికి నిప్పంటించాడు. అంత్య క్రియలు ముగిసాయి. రోజులు గడుస్తున్నా, అన్నపూర్ణమ్మ దిగులుగానే ఉంటున్నది. విరంచి ఎక్కువ సమయం బంగ్లాలో ఉంటూ ఆమెను కనిపెట్టుకుని ఉంటున్నది.
విజయ్ యధావిధిగా సచివాలయానికి పోతున్నాడు. విధినిర్వహణలో అలసత్వం పనికి రాదని భావించాడు. వెంటనే ఉన్నతాధికారులను పిలిచి సమీక్షలు నిర్వహించారు. వరుస బేటీలో ఆయన బిజీ అయ్యారు.
జానకి రామయ్య మృతి చెంది ఏడాది గడవటంతో అన్నపూర్ణమ్మ పెళ్లి ప్రస్తావన తెచ్చింది. ఇప్పటివరకు పెళ్లి వద్దని భీష్మించుకున్న విజయ్ లోనూ మార్పు వచ్చింది. పెద్దనాన్న చనిపోయారు, ఆయన ఉండి ఉంటే ఎంతో అర్భాటంగా ఈ కార్యక్రమంనిర్వహించే వారంటూ ఆమె కన్నీళ్లు ఒత్తుకుంది. విరంచి తల్లిదండ్రులు కూడా పెళ్లి నిర్వహణలో హంగులేమి లేకుండానే జరపడానికి అంగీకరించడంతో విరంచి, విజయ్‌ల పెళ్లి సాధారణంగా జరిగింది. మంత్రివర్గ సహచరులు, ఉన్నతాధికారులు, అన్ని రాజకీయ పార్టీల నేతలు, ఢల్లీి నేతలు కూడా పెళ్లికి హాజరయి, వధూవరులను ఆశీర్వధించారు.
సశేషం)
తప్పకచదవండి:విజయుడు (ధారావాహిక నవల పార్ట్-50)