కోహ్లీ సంచ‌ల‌న నిర్ణ‌యం.. టెస్ట్ కెప్టెన్సీకి గుడ్‌బై

న్యూఢిల్లీ (CLiC2NEWS): ఇండియ‌న్ స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు. ఇప్ప‌టికే టి 20, వ‌న్డే కెప్టెన్సీల‌ను వ‌దులుకున్న విరాట్… తాజాగా టెస్ట్ కెప్టెన్సీకి కూడా గుడ్బై చెప్పారు. దీంతో అన్ని ఫార్మ‌ట్ల సారథ్య బాధ్య‌త‌ల నుంచి వైదొలిగినట్ల‌యింది. వ‌న్డే నాయ‌క‌త్వం నుంచి కోహ్లీని తొల‌గించిన బిసిసిఐ ఆయ‌న స్థానంలో రోహిత్ శ‌ర్మ‌ను కెప్టెన్‌గా నియ‌మించిన విష‌యం తెలిసిందే.

కాగా కెప్టెన్సీకి గుడ్‌బై చెబుతున్న‌ట్లు విరాట్ కోహ్లీ ట్విట్ట‌ర్లో పోస్టు చేశాడు. ఈ మేర‌కు కోహ్లీ సుదీర్ఘ లేఖ‌ను రాసుకొచ్చాడు.
“దాద‌పు ఏడు సంవ‌త్స‌రాల పాటు జ‌ట్టును స‌రైన మార్గంలో న‌డిపించేందుకు కృషి చేశా. బాధ్య‌ల‌త‌ల‌ను ఎంతో నిబద్ధ‌త‌తో నిర్వ‌ర్తించా… ప్ర‌తి దానికి ముగింపు అనేది ఉంటుంది. అది నా టెస్టు కెప్టెన్సీకి కూడా. ఇప్ప‌టి వ‌ర‌కు సాగి నా ఈ ప్ర‌యాణంలో ఎన్నో విజ‌యాల‌ను, అప‌జ‌యాల‌ను చూశా.కానీ ఎప్పుడూ ప్ర‌య‌త్నాన్ని మాత్రం వ‌ద‌ల్లేదు. పూర్తి న‌మ్మ‌కంతో 120 శాతం శ్ర‌మించాను. ఈ సంద‌ర్భంగా బిసిసిఐ, ర‌విశాస్త్రి, ధోనికి కృత‌జ్ఞ‌త‌లు“
అని విరాట్ పేర్కొన్నాడు.

Leave A Reply

Your email address will not be published.