కంచి కామకోటి పీఠాధిపతిని దర్శించి తరించండి..
పీఠసేవకులు అయినవిల్లి కామేశ్వరరావు..

మండపేట (CLiC2NEWS): మండపేట విచ్చేసి పావనం చేయనున్న కంచి కామకోటి 70వ పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతీ మహాస్వామిని దర్శించుకుని తరించాలని పీఠ సేవకులు అయినవిల్లి కామేశ్వరరావు శర్మ భక్తులకు విజ్ఞప్తి చేశారు. ధర్మగుండం చెరువు బ్రాహ్మణ సత్రం శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో పీఠ సేవకులు అయినవిల్లి కామేశ్వరరావు, రుద్రశర్మ, స్వామినాథ శర్మ తదితర బ్రాహ్మణ పెద్దలతో కలిసి గురువారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కంచి పీఠాధిపతి మండపేట పర్యటన వివరాలు వెల్లడించారు. ఈ నెల 16 సాయంత్రం విజయేంద్ర సరస్వతీ మహాస్వామి మండపేటలో అడుగు పెట్టనున్నారని చెప్పారు. కలువపువ్వు సెంటర్ నుండి ఆయనకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలుకుతామన్నారు. 17 ఉదయం 9 గంటల నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందిస్తారని చెప్పారు. 19 వరకూ ఆయన మండపేటలోనే బస చేయనున్నారన్నారు. మూడు రోజుల పాటు పట్టణ ప్రజలకు అందుబాటులో ఉంటారని స్వామివారిని దర్శించుకుని వారి అనుగ్రహం పొందగలరని విజ్ఞప్తి చేశారు. పరిసర ప్రాంత ప్రజలు పట్టణ ప్రజలు తమ విజ్ఞప్తి మేరకు స్వామి వారి కృపకు పాత్రులై ఆశీస్సులు పొందాలని విన్నవించారు. ఈ సమావేశంలో అయినవిల్లి సోమనాధ నాగేశ్వర శర్మ, సూర్య సుబ్రహ్మణ్య శర్మ, రాజరాజేశ్వర రుధ్రశర్మ, వెలవెలపల్లి సూర్య వెంకట సర్వ నాగ రత్న శర్మ., పట్టణ బ్రాహ్మణ ప్రముఖులు , కడియాల ప్రసాద్, నిట్టాల సత్యనారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
I am currently perfecting my thesis on gate.oi, and I found your article, thank you very much, your article gave me a lot of different ideas. But I have some questions, can you help me answer them?