లోక్ సభ లో ఓటర్ ఐడి.. ఆధార్ అనుసంధాన బిల్లు..

న్యూడిల్లీ (CLiC2NEWS): దేశంలోని ఎన్నికల ప్రక్రియలో కీలక సంస్కరణలు చేపట్టేలా తీసుకొచ్చిన ఎన్నికల చట్టాల (సవరణ ) బిల్లును కేంద్ర సర్కార్ ఇవాళ (సోమావారం) లోక్ సభలో ప్రవేశపెట్టింది. బోగస్ ఓట్లను తొలగించడమే లక్ష్యంగా ఓటరు ఐడీని ఆధార్ కార్డుతో లింక్ చేసేలా రూపొందించిన ఈ బిల్లును కేంద్ర న్యాయమంత్రి కిరణ్ రిజుజు నేడు సభలో ప్రవేశపెట్టారు.
ఈ బిల్లును విపక్షాలు సభలో వ్యతిరేకించాయి. బోగస్ ఓటింగ్, నకిలీ ఓటింగ్‌ను నిర్మూలించాలంటే ఈ బిల్లుకు ఆమోదం తప్పని సరి అని మంత్రి రిజుజు పేర్కొన్నారు.
ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ నాయకుడు మనీష్ తివారీ అన్నారు. ఆధార్ చట్టం ప్రకారం ఓటర్ కార్డుతో ఆధార్ అనుసంధానం చేయరాదని ఆయన తెలిపారు.