జలమండలి మేనేజర్, వర్క్ ఇన్‌స్టెక్టర్‌ను సస్పెండ్ చేసిన ఎండీ దానకిశోర్

హైదరాబాద్ (CLiC2NEWS): విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన మేనేజర్, వర్క్ ఇన్‌స్టెక్టర్‌ను సస్పెండ్ చేసిన జలమండలి ఎండీ దానకిశోర్. కలుషిత నీటి సమస్యలను అరికట్టడానికి కొత్త పైప్‌లైన్ మంజూరు చేసి నెల రోజులు గడుస్తున్నా కొత్త పైపు నిర్మాణ పనులు మొదలుపెట్టని మేనేజర్, వర్క్ ఇన్‌స్టెక్టర్‌పై ఎండీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముషీరాబాద్‌లో కలుషిత నీటి సమస్యలను అరికట్టడానికి నెల క్రితం రూ.4.2 లక్షలతో కొత్త పైప్‌లైన్‌ను ఎండీ దానకిశోర్ మంజూరు చేశారు. నెల గడిచినా పైపు లైన్ నిర్మాణ పనులు ప్రారంభించకపోవడంతో ఇద్దరిపై క్రమశిక్షణ చర్యగా సస్పెండ్ చేశారు.