ఎఫ్ఎస్టీపీ పనులను తనిఖీ చేసిన జలమండలి ఎండీ

హైదరబాద్ (CLiC2NEWS): ఉప్పల్ లోని నల్ల చెరువు ఎస్టీపీ ప్రాంగణంలో జలమండలి నూతనంగా నిర్మిస్తున్న ఎఫ్ఎస్టీపీ పనులను జలమండలి ఎండీ ఎం. దానకిషోర్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ జరుగుతున్న ఎఫ్ఎస్టీపీ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ ప్రాంగణం లో సుందరీకరణ పనులను తొందరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. త్వరలోనే ఈ ఎఫ్ఎస్టీపీ ని ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి మంత్రి కెటిఆర్ ప్రారంభించనున్నట్లు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. అనంతరం ఆయన ఈ ప్రాంగణంలో మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో జలమండలి ప్రాజెక్టు డైరెక్టర్ డి. శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.