భార‌త్ చ‌ర్య‌లు భేష్.. ప్ర‌పంచంలో ఎవ‌రూ చేయ‌నిది చేస్తున్నాం: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ (CLiC2NEWS): క‌రోనాను ఎదుర్కోవ‌డంలో భార‌త్ చేస్తోన్న కృషిని మ‌రే దేశం చేయ‌లేక‌పోయిందని దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం ప్ర‌శంసించింది. కొవిడ్‌-19తో మ‌ర‌ణించిన వారి కుటుంబ స‌భ్యుల‌కు ప‌రిహారం, డెత్ స‌ర్టిఫికెట్ ఇవ్వాల‌న్న నిర్ణ‌యంపై కేంద్రాన్ని ప్ర‌శంసించింది సుప్రీంకోర్టు. ప్ర‌పంచంలో ఏ దేశం చేయ‌ని ప‌ని ఇండియా చేస్తున్న‌ద‌ని ఈ సంద‌ర్భంగా అత్యున్న‌త న్యాయ‌స్థానం వ్యాఖ్యానించింది. ఈ విష‌యంలో మేము చాలా సంతోషంగా ఉన్నాం. కొవిడ్ బాధిత కుటుంబాల క‌న్నీళ్లు తుడ‌వ‌డానికి క‌నీసం ప‌రిహారమైనా ఇస్తున్నారు అని జ‌స్టిస్ ఎంఆర్ షా అన్నారు. క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారిపై ఇండియా స్పందించిన తీరును కూడా జ‌స్టిస్ షా, జ‌స్టిస్ ఏఎస్ బోప‌న్న‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం కొనియాడింది.

అధిక జ‌నాభా క‌లిగిన దేశంగా ఉన్న‌ప్ప‌టికీ.. వ్యాక్సిన్‌ల ఖ‌ర్చు, దేశ ఆర్థిక‌స్థితి, ప్ర‌తికూల ప‌రిస్థితుల్లో ఎదురైన స‌వాళ్ల‌పై ప్ర‌బుత్వం స‌రైన రీతిలోనే స్పందించిందని అన్నారు. కోవిడ్ పోరులో మ‌రో దేశం ఇలా చేయ‌లేక‌పోయింద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

కొవిడ్ మృతుల కుటుంబాల‌కు రూ.50 వేలు ఇవ్వాల‌ని నేష‌న‌ల్ డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ అథారిటీ సిఫార్సు చేసిన‌ట్లు బుధ‌వారం సుప్రీంకోర్టుకు చెప్పింది కేంద్ర ప్ర‌భుత్వం. దీనికి సంబంధించిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను కూడా ఎన్‌డీఎంఏ జారీ చేసిన‌ట్లు తెలిపింది. తొలి, మ‌లి ద‌శ కొవిడ్ స‌మ‌యంలో చ‌నిపోయిన వారికే కాదు.. ఇది భ‌విష్య‌త్తులోనూ కొన‌సాగుతుంద‌ని కూడా ఆ మార్గ‌ద‌ర్శ‌కాల్లో ఎన్డీఎంఏ స్ప‌ష్టం చేసింది. ఈ ప‌రిహారం మొత్తాన్ని రాష్ట్ర విప‌త్తు స్పంద‌న నిధి (ఎస్‌డిఆర్ ఎఫ్) కింద ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు అంద‌జేస్తాయ‌ని కోర్టులో దాఖ‌లు చేసిన అఫిడ‌విట్‌లో కేంద్ర ప్ర‌భుత్వం పేర్కొంది. ఈనేప‌థ్యంలోనే క‌రోనా పోరుపై కేంద్ర స‌ర్కార్ తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై సుప్రీం కోర్టు సంతృప్తి వ్య‌క్తం చేసింది.

1 Comment
  1. Ekskurzia Dubai says

    Hi are using WordPress for your blog platform? I’m new to the blog world but I’m trying to
    get started and create my own. Do you need any html coding knowledge tto make your own blog?
    Any help would be greatly appreciated!
    Ekskurzia Dubai
    фото города дубай – Ekskurzia-dubai.bg,

    дубай сколько лететь

Leave A Reply

Your email address will not be published.