భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం: ప్రభుత్వ విప్ బాల్క సుమన్

మంచిర్యాల (CLiC2NEWS): భారీ వర్షాల మూలంగా పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. చెన్నూర్ నియోజకవర్గంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల ముంపునకు గురైన పంట పొలాలను చింతలపల్లి గ్రామంలో క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడటం జరిగింది. అనంతరం మంచిర్యాల జిల్లా వరదలపై శ్రీరామ్ పూర్ గెస్ట్ హౌస్‌లో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ.. వరద ప్రభావం, పంట నష్టాన్ని క్షేత్ర స్థాయిలో ఇవాళ పరిశీలించామని తెలిపారు.. రైతులను పూర్తి స్థాయిలో ఆదుకుంటామని పేర్కొన్నారు. ఇప్పటికే నష్ట పరిహారం విషయంపై సోమవారం (సెప్టెంబర్ 8) న ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావుకు వినతిపత్రం అందించాం.
చెన్నూరు నియోజకవర్గంలోని కోటపల్లి, చెన్నూర్, జైపూర్ మండలాల్లో 5,545 ఎకరాల్లో పంటనష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనాకు వచ్చామన్నారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ భారతీ హొళికేరీ, వెంకటేశ్వర్లు ( ఈఎన్ సీ కాళేశ్వరం ప్రాజెక్ట్), ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
అనంతరం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని IB చౌరస్తాలో మట్టి వినాయక విగ్రహాలను బాల్కసుమన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంచి ర్యాల కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు.

తరువాత పట్టణంలో పట్టణంలో ఇటీవల నూతనంగా ప్రారంభించిన మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, స్థానిక నాయకులు హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
