కేంద్రం నుండి అన్ని విధాలా సాయం అందజేస్తాం: అమిత్‌షా

ఢిల్లీ (CLiC2NEWS): తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల గురించి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సిఎంలతో మాట్లాడారు. ఎపి సిఎం చంద్రబాబు, తెలంగాణ సిఎం రేవంత్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడి పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. ఎపిలో చేపట్టిన వరద సహాయక చర్యలను అమిత్‌షాకు సిఎం చంద్రబాబు వివరించారు. ఎన్డిఆర్ ఎఫ్ ద్వారా పవర్‌బోట్లు పంపాలని ఆయన కోరారు. అవసరమైన మేరకు సాయం చేస్తామని, ప్రస్తుతం తక్షణ సాయం అందేలా చూస్తామని అమిత్‌షా తెలపారు.
తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన నష్టాన్ని గురించి అమిత్‌షాకు రేవంత్ రెడ్డి వివరించారు. ప్రాణ నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుండి అన్ని విధాల సాయం అందజేస్తామని అమిత్‌షా హామీ ఇచ్చారు.