ఒమిక్రాన్‌పై ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను గౌరవిస్తాం: మంత్రి హారీశ్‌రావు

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హారీశ్ రావు వెల్లడించారు. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి వేడుకలపై ఆంక్షలు విధించాలని, రెండు మూడురోజులలో ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తామని తెలిపారు.
ఈరోజు హైదరాబాద్‌లోని దుర్గాభాయ్ దేశ్‌ముఖ్ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐసియు, ఆపరేషన్ థియేటర్‌లను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్య శ్రీ బిల్లులు ప్రతి నెలా చెల్లించేలా చర్యలు తీసుకుంగామని తెలిపారు. ఆయుష్మాన్ భారత్‌ను ప్రబుత్వ ఆసుపత్రులకే పరిమితం చేశామని, అవకాశం ఉంటూ ఈ పథకాన్ని దుర్గాభాయ్ దేశ్‌ముఖ్ ఆసుపత్రికి విస్తరిస్తామని తెలిపారు.