వేసవి కాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే.. -2
తదుపరి శీర్షిక వేసవికాలంలో ఆపథ్యాహర విహారాదులు
వేసవికాలంలో కారం, పులుపు, వేడి, కరకారాలాడేవి, వగరు, పాసిపోయిన, ఎక్కువ ఉప్పు తో వున్న, వేయించిన, తిరిగి వెచ్చబెట్టిన, ఫ్రిజ్లో ఎక్కువ సేపు నిల్వ ఉంచిన భోజనం పదార్దాలు సేవించిరాదు. పెరుగు, పుల్లటి మజ్జిగ తీసుకోరాదు.
ఎర్ర మిర్చి, మిర్చితో కలిసిన పదార్దాలు, మినపప్పు, వెల్లుల్లి, ఆవాలు, తేనే, వంకాయ, కొయ్య కూర, మద్యం, వ్యతిరేకమైన ఆహార పదార్దాలు తీసుకిరాదు. తేనే చల్లని నీటితో తీసుకోవాలి.
మనకు తెలియకుండానే మనం తాగే నీరు ఫ్రీజ్లోది అయితే గ్యాస్, మలబద్ధకం, ఏసీడీటీ, stomach కాన్సర్, వస్తుంది. ఫ్రీజ్ నీరు ఎక్కువగా తాగటం వలన పళ్ళు జివ్వున గుంజటం జరుగుతుంది.
ఎండాకాలంలో బయట తిరిగి వస్తే ముందుగా కొద్దిగా నీరు తాగి, తరువాత మజ్జిగలో ఉప్పు లేదా పంచదార కలిపి తాగాలి. ఆలా చేయకుండా నిమ్మరసం తాగితే వాంతులు కూడా రావచ్చును.
ఇంట్లో కూలర్ వాడితే పర్వాలేదు. Ac లో ఉండి ఒకేసారి బయటకు వెళితే వేడి గా ఉంటుంది. Ac ని తక్కువగా వాడండి.
మూడు కాలాల్లో ఎండ కాలం మాత్రం రాత్రులు తక్కువ, పగలు ఎక్కువ కనుక పగలు వీలుంటే కొద్దిసేపు విశ్రాంతి తీసుకోండి. రాత్రులు త్వరగా నిదురపోండి. ఈ కాలంలో ఎక్కువగా శ్రమ చేయవద్దు.
ఏ వ్యాయామం అయినా సరే తక్కువ సమయం చేయండి. ఎక్కువగా చేస్తే నీరసం వస్తుంది.
ఉదయం ఏదైనా జావా కానీ, ఫ్రూట్స్ సలాడ్స్ కానీ, గంజి కానీ, తీసుకోండి.
ఉదయం 11 గంటలకు నిమ్మరసం తాగండి. సాయంత్రం ఏదైనా జ్యూస్ కానీ కొబ్బరిబోండా, చెరుకు రసం, బత్తాయి రసం తాగండి. ఐస్ క్రీం, కూల్ కేక్, బజారులో బండ్లు పెట్టి అమ్మే బాదాం పాలు, జ్యూస్, mixed ఫ్రూట్స్ జ్యూస్ or మిక్సిడ్ ఫ్రూట్స్ కానీ, తీసుకున్నారు దానిలో నిల్వ ఉంచినవి అయితే కాన్సర్ వస్తుంది.
రాత్రి భోజనం త్వరగా చేయండి, పడుకునేటప్పుడు నీరు తాగి పడుకోండి.
కిడ్నీ problem వున్నవారు నీరు కొద్ది కొద్దిగా తాగాలి.
“పధ్యే సతి గదార్తస్య కిమౌషదని షేవనై “పధ్యే సతి గదార్తస్య కిమౌషదని షేవనై ”
-షేక్ బహార్ అలీ
ఆయుర్వేద వైద్యుడు