మధుర గీతాలు ఎందుకు మాకు..
మధుర గీతాలు ఎందుకు మాకు..
నీ పిల్లనగ్రోవి సంగీతాలే చాలు కృష్ణయ్య.!
అక్షతలెందుకు మాకు..
క్షతం కాని నీ ప్రేమ ఉండగా కృష్ణయ్య.!
సుగంధ దవ్ర్యా లు ఎందుకు మాకు..
నీ మేని పరిమళమే చాలు కృష్ణయ్య.!
అన్నపానీయాలు ఎందుకు మాకు..
నీ సాన్ని ధ్యం చాలు కృష్ణయ్య.!
మంచు పొగలు ఎందుకు మాకు..
నీ విరహపు సెగలే చాలు కృష్ణయ్య.!
-మంజుల పత్తిపాటి