World Record: 3.14 ల‌క్ష‌ల కేసులు.. 2014 మ‌ర‌ణాలు

న్యూఢిల్లీ: ఇండియాలో క‌రోనా మ‌హా విల‌యం కొన‌సాగుతోంది. పాజిటివ్ కేసుల్లో మ‌న దేశం వ‌ర‌ల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. రోజువారీ పాజిటివ్ కేసుల్లో గ‌త 24 గంట‌ల్లో 3.14 ల‌క్ష‌ల కేసులు న‌మోదు అయ్యాయి. ప్ర‌పంచంలోనే ఒకే రోజు ఇన్ని కేసులు ఓ దేశంలో న‌మోదు కావ‌డం ఇదే మొద‌టిసారి. దీంతో దేశ‌వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 1.59 కోట్ల‌కు చేరింది. తాజగా దేశంలో 3,14,835 కరోనా కేసులు నమోదు కాగా, 2014 మరణాలు సంభవించాయి. దేశంలో ఇప్పటి వరకు దేశంలో 1,59,30,965 కరోనా కేసులు నమోదు కాగా, 1,84,657 మరణాలు సంభవించాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 1,78,841 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు దేశంలో మొత్తం 1,34,54,880 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 22,91,428 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

దేశంలో ఇప్ప‌టికే ఆక్సిజ‌న్ అంద‌క అనేక మంది అసువులుబాస్తున్నారు. యాంటీ వైర‌ల్ డ్ర‌గ్ రెమిడిసివిర్‌కు భారీ డిమాండ్ ఉన్న‌ది. గ‌తంలో అమెరికా పేరిట ఉన్న పాజిటివ్ కేసుల రికార్డును భార‌త్ తిర‌గ‌రాసింది. జ‌న‌వ‌రిలో అమెరికాలో ఓ రోజు అత్య‌ధికంగా 2,97,430 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఇప్పుడు ఇవాళ ఇండియా ఆ రికార్డును బ్రేక్ చేసింది.

Leave A Reply

Your email address will not be published.