యాదాద్రి ఇకనుండి యాదగిరిగుట్ట: సిఎం రేవంత్రెడ్డి
యాదాద్రి (CLiC2NEWS) : ఇకనుండి యాదాద్రిని యాదగిరిగుట్టగా వ్యవహారంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. సిఎం జన్మదినం సందర్బంగా ఆయన శుక్రవారం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అభివృద్ధి గురించి సమీక్ష నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. టెంపుల్ బోర్డు ఏర్పాటు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, విధివిధానాలు రూపొందించాలని అదేశించారు. విమాన గోపురానికి బంగారు తాపడం పనులను వేగవంతం చేయాలని.. బ్రహ్మోత్సవాల నాటికి బంగారు తాపడం పనులు పూర్తి చేయాలన్నారు. దానికి సంబంధించిన నిధులను మంజూరు చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.