యాసంగి ధాన్యం మొత్తం రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే కొనుగోలు చేస్తుంది: సిఎం కెసిఆర్‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): యాసంగిలో పండించిన వ‌రి ధాన్యాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే కొంటుంద‌ని ముఖ్య‌మంత్రి కెసిఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో స‌మ‌ర్ధ‌మైన ప్ర‌భుత్వం ఉంద‌ని, ఒక్క‌గింజ కూడా రైతులు త‌క్కువ ధ‌ర‌కు అమ్ముకోవ‌ద్ద‌ని అన్నారు. క్వింటాల్ ధాన్యానికి రూ. 1960 చొప్పున చెల్లిస్తామ‌ని, ధాన్యం డ‌బ్బులు నేరుగా రైతుల ఖాతాల్లో జ‌మ చేస్తామ‌ని అన్నారు. ఈసంద‌ర్భంగా సిఎం మాట్లాడుతూ..

స‌మైక్య రాష్ట్రంలో అత్యంత బాధాక‌రంగా న‌లిగిపోయి, చితికిపోయిన రంగం వ్య‌వ‌సాయ రంగం. తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత సాగునీటి రంగంపై ప్ర‌త్యేక దృష్టి పెట్టామని, రాష్ట్రంలో పక్కా ప్ర‌ణాళిక‌తో అద్భుత‌మైన ఫ‌లితాలు వ‌చ్చాయ‌న్నారు. 24 గంట‌లు విద్యుత్ అందిస్తున్నామ‌ని, ఆన్‌గోయింగ్ పెండింగ్ ప్రాజెక్టులు స‌త్వ‌రం పూర్తి చేయ‌డం, మిష‌న్ కాక‌తీయ పూర్తి చేయ‌డం, రిఇంజ‌నీరింగ్ చేసి భారీ ప్రాజెక్టుల‌కు శ్రీ‌కారం చుట్టి వ‌ర‌ల్డ్ లార్జెస్ట్ మ‌ల్టీ ఇరిగేష‌న్ స్కీం పూర్తి చేశామ‌న్నారు. రాష్ట్రంలోని రైతుల‌కు సాగు ఖ‌ర్చుల నిమిత్తం ఎక‌రానికి రూ. 10వేలు ఇస్తున్నామ‌ని, 24 గంట‌ల ఉచిత విద్యుత్‌, నీటి స‌ర‌ఫ‌రా చేస్తున్నామ‌ని సిఎం పేర్కొన్నారు.

 

1 Comment
  1. Libedo Pills says

    I do trust all of the ideas you have introduced for your post.
    They are really convincing and can definitely work. Still,
    the posts are very quick for beginners. Could you please extend them a bit from
    subsequent time? Thank you for the post.

Leave A Reply

Your email address will not be published.