Yellareddy: నూతన ప్రింట్ మీడియా కమిటీ ఎన్నిక ఏకగ్రీవం

ఎల్లారెడ్డి (CLiC2NEWS): ఎల్లారెడ్డి పట్టణంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో సోమవారం ప్రింట్ మీడియా గౌరవ అధ్యక్షులు సోమయాజుల రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రింట్ మీడియా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎల్లారెడ్డి ప్రింట్ మీడియా అధ్యక్షునిగా సిద్దిరామ గౌడ్, ఉపాధ్యక్షులుగా లక్మి నారాయణ, ముక్రం లు, ప్రధాన కార్యదర్శి గా శివకుమార్ తుప్తే వార్, సంయుక్త కార్యదర్శులుగా సత్యనారాయణ గడ్డమీది, శ్రీనివాస్ ఉక్కల్కర్ లు, కోశాధికారిగా బొందుగుల నాగేశ్వరరావు, అడహక్ కమిటీ సభ్యులుగా సోమయాజుల రాజ్ కుమార్, శివ కుమార్, పార్థసారథి, ప్రభాకర్, రామప్ప, ఆదిమూలం సతీష్, కార్యవర్గ సభ్యులుగా రఘు, గోవర్ధన్ కొడకల, వెంకట్ ఆకుల, హసినోద్దీన్, మహ్మద్ అనీఫ్, మహేష్, సంగ్రామ్ నాయక్, సంజీవులు ప్రచార కార్యదర్శిగా గోరంటీ శేఖర్ లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు సిద్దిరామ గౌడ్ మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని, అదేవిధంగా ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రింట్ మీడియా సమస్యలను తీర్చేదిశగా పనిచేస్తామని తెలిపారు.