శారీరక, మానసిక రోగాలకు యోగ చక్కని మందు

హైదరాబాద్ (CLiC2NEWS): శంషాబాద్… చేగుర్ గ్రామంలోని కాన్హా శాంతి వనం ఆశ్రమం లో స్వామి బాబా రాందేవ్ యోగ శిక్షణ శిభిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అథితిగా నన్ను (sk. బహార్ అలీ) ఆహ్వానించారు. ఇక్కడ నిర్వహించిన యోగా శిబిరంలో రాందేవ్ బాబాతో పాటు స్టేజి మీద నేను కూడా యోగ ఆసనాలు వేశాము. ఈ శిబిరంలో ఆశ్రమ నిర్వాహకులు కమలేష్ దేశాయ్ భాయ్ పటేల్, తెలంగాణ భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ ప్రెసిడెంట్, ఈ కార్యక్రమ రూపకర్త గునుగంటి శ్రీధర్ రావు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం యోగ అనేది అందరిదీ అందరు చేయాలి..
యోగ ఏ మతానికి, కులానికి, ప్రాంతానికి చెందింది కాదు. యోగ ఒక పూర్ణ చికిత్స పద్ధతి, యోగ ఒక సంపూర్ణ జీవన శైలి, యోగ ఒక ఆధ్యాత్మిక పద్ధతి. యోగ ఒక పూర్ణం విజ్ఞానం. పిల్లలు, పెద్దలు, యువకులు, యువతులు, రోగగ్రస్థులు, ఆరోగ్యవంతులు, గృహిణిలు, బ్రాహ్మచారులు, సన్యాసులు అందరు చేయవచ్చును.
యోగ అంటే ఒక “కలయిక” అని స్వామి వివేకానంద గారు చెప్పినారు.”
యోగేన చిత్తస్య పదేనా వాచా!
మలం శరీరస్య చ వైద్యకేన!
యోపాకరోత్తం ప్రవరం మునినాం!
పతంజలి ప్రాంజలి రానాతోష్మి!
యోగ చేత బుద్ది వికారాలు, రోగాలను, వ్యాకరణం చేత వాక్కులోని (వాగ్ దోషాలు )దోషలాన్ని, మరియు ఔషాదం చేత శరీరంలో రోగాలను నశింపచేసే పతంజలి మహర్షికి నమస్కృతులు.
శారీరక రోగాలను ఆయుర్వేదం ద్వారా.. మానసిక రోగాలు యోగ ద్వారా.. వాగ్ దోషములను వ్యాకరణం ద్వారా తగ్గించుకోవచ్చును అని పతంజలి ముని శ్రేష్టుడు చెప్పారు.
అందరు యోగప్రాణాయామం చేసి రోగాలను రాకుండా ఆరోగ్యం గా వుండండి. మధుమేహం వచ్చిన వారికి రోగం తగ్గించుకునేందుకు ఇక్కడ జరిగిన కార్యక్రమంలో బాబా రాందేవ్ యోగసనాలు చెప్పినారు. వారితో నేను కూడా ఆసనాలు అన్ని వేసి చూపించటం జరిగింది. ఎవరైనా రోగాలు కనుక వస్తే ఒక యోగ గురువు దగ్గర చికిత్స చేయించుకోండి.
Bp. షుగర్. అస్తమా, సైనస్, కాన్సర్, నొప్పుల, రోగాలు, గ్యాస్, ఏసీడీటీ, పక్షవాతం, సంధివాతం, అమవాతం,స్ట్రెస్, ఇతర రోగాలు యోగ ద్వారా తగ్గించుకోవచ్చును. అలాగే బాబా రాందేవ్ గారు నమాజ్ లో ఖాయిదా గురించి కూడా చక్కగా చెప్పినారు. మనము అందరమూ ముందుగా భారతీయులు, అందరు కలిసిమెలిసి బ్రతకాలని చెప్పారు. ఆరోగ్యకరమైన భారతదేశంకోసం అందరు ఆరోగ్యవంతులుగా వుండండి. స్వస్త్ శిక్షణ, స్వయం రక్షణ. “కరో యోగ,- రహో నిరోగ్,
-షేక్. బహార్ అలీ
యోగాచార్యుడు