దారుణం.. యువతికి మద్యం తాగించి సామూహిక అత్యాచారం!

నిజామాబాద్‌ (CLiC2NEWS): జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. న‌లుగురు యువ‌కులు ఓ యువ‌తిపై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. నిజామాబాద్‌లో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రి గదిలో నలుగురు యువకులు ఓ యువతికి మద్యాన్ని తాగించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది డయల్‌ 100 కు ఫిర్యాదు చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు యువతి మద్యం మత్తులో ఉన్న‌ట్లు గుర్తించారు. యువ‌తికి మ‌ద్యం తాగించి ఈ అఘాయిత్యానికి పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. పోలీసులు బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.