AP: 59 మందికి వైఎస్సార్ పురుస్కారాలు

అమరావతి(CLiC2NEWS) :ఆంధ్రప్రదేశ్‌లో వివిధ రంగాల్లో సేవలందించిన వారికి సిఎం జగన్ వైఎస్సార్ పురస్కారాలను అందించారు. విజయవాడలోని ఎ1 కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌తో కలసి సిఎం జగన్ పాల్గొన్నారు.
ఈసందర్భంగా సిఎం మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే భారతరత్న, పద్మ అవార్డుల తరహాలో రాష్ట్రంలోనూ త్యున్నత పౌర పురస్కారాలు ఇస్తున్నామని అన్నారు. అవార్డుల ఎంపికలో కులం, మతం, ప్రాంతం, రాజకీయ నేపథ్యం చూడలేదని, మానవత, సేవ, ప్రతిభ ఆధారంగా ఎంపిక చేశామని తెలిపారు. ప్రతి సంవత్సరం నవంబర్ 1వ తేదీన అవార్డులు ప్రధానం చేస్తామన సిఎం వెల్లడించారు. లైఫ్‌టైమ్ అచీవ్ మెంట్ అవార్డకురు. 10 లక్షలు, కాంస్యవిగ్రహం, యోగ్యతాపత్రం, అచీవ్ మెంట్ అవార్డుకు రూ.5 లక్షలు , కాంస్యవిగ్రహం, యోగ్యతాపత్రం అందజేశారు.
వైఎస్సార్ విశేష కృషి చేశారు: గవర్నర్
ఎపి గవర్నర్ విశ్వభూషణ్ మాట్లాడుతూ.. వైద్య వృతి చేసి వ్యవసాయానికి, విద్యారంగాలకు విశేష కృషి చేశారన్నారు. ‘‘ రాష్ట్ర చరిత్రలో వైఎస్సార్ గొప్ప వ్యక్తిగా నిలిచారు. వైఎస్సార్‌కు విద్య, వైద్యం, అంటే ఎంతో మక్కువ. పేదల నాడి తెలిసిన డాక్టర్ వైఎస్సార్.. వారి కోసం ఆరోగ్యశ్రీని తీసుకొచ్చారు. సామాన్యులకు నాణ్యమైన వైద్యం అందించి ప్రజల హృదయాలను గెలిచారని’’ అన్నారు. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో విశిష్టమైనవన్నారు . వైఎస్సార్ అవార్డులు అందుకున్నవారికి అభినందనలు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని జగన్నాథుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.