`వైఎస్సార్ ఇబిసి నేస్తం` ప్రారంభించిన సిఎం జగన్
అమరావతి (CLiC2NEWS):
అగ్రవర్ణ పేద మహిళలకు మెరుగైన జీవానోపాధి లక్ష్యంగా `వైఎస్సార్ ఇబిసి` పథాకాన్ని తీసుకొచ్చినట్లు సిఎం జగన్ అన్నారు. తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ ఇబిసి నేస్తం పథకాన్ని ఎపి సిఎం జగన్ మంగళవారం ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,92,674 మంది అక్కచెల్లెమ్మలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. దీనిలో భాగంగా ఎపి సర్కార్ 589 కోట్ల రూపాయలు విడుదల చేసింది.
ఈ సందర్భంగా సిఎం జగన్ మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టో లో ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేసి చూపిస్తున్నామని అన్నారు.. అలాగే ఇవ్వని హామీలూ చేసి చూపిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,93 లక్షల మంది 45 నుండి 60 యేళ్ల మధ్య వయసున్న మహిళలను ఈ పథకానికి అర్థులుగా గుర్తించారు. వీరి ఖాతాల్లో రూ. 589కోట్ల ఆర్థిక సాయాన్ని బటన్ నొక్కి సిఎం జమ చేశారు.