అక్టోబర్ 9 నుంచి బతుకమ్మ చీరలు పంపిణీ
- జౌళి శాఖ మంత్రి కేటీఆర్

హైదరాబాద్ : ప్రతి ఏడాదిలానే ఈ సారి కూడా బతుకమ్మ పండుగకు సర్కార్ ఆడబిడ్డలకు చీరలను పంపిణీ చేస్తుందని రాష్ర్ట ఐటీ, జౌళి శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. బేగంపేట హరిత ప్లాజాలో మంగళశారం ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల ప్రదర్శనలో మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బతుకమ్మ చీరలను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలోని అక్కాచెల్లెళ్లకు ముందస్తుగా బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. అక్టోబర్ 9 నుంచి బతుకమ్మ చీరలను పంపిణీ చేయబోతున్నామని చెప్పారు. ఈ నెల 17వ తేదీ నుంచి బతుకమ్మ ప్రారంభం కాబోతోంది. కరోనా దృష్ట్యా చీరలను మహిళల ఇళ్ల వద్దే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మహిళా సంఘాలు చీరలను పంపిణీ చేస్తాయని తెలిపారు. ఈ ఏడాది 287 డిజైన్లతో బంగారు, వెండి జరీ అంచులతో చీరలను తయారు చేశారు. రూ. 317.81 కోట్ల వ్యయంతో కోటికి పైగా బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నారు. 2017లో 220 కోట్ల రూపాయాలు, 2018లో 280 కోట్ల రూపాయాలు, 2019లో 313 కోట్లు, 2020లో 317.81 కోట్లు బతుకమ్మ చీరలకు వెచ్చిస్తున్నామని చెప్పారు. 26 వేల పవర్ లూమ్స్‌కు పని కల్పిస్తున్నామని పేర్కొన్నారు. వేలాది నేతన్నల కుటుంబాలకు ఉపాధి కల్పించాం. ఒక్క బతుకమ్మ చీరలకే రూ. 1033 కోట్లు ఖర్చు పెట్టింది. ఈ నాలుగేళ్లలోనే నాలుగు కోట్ల చీరలను పంపిణీ చేసింది. 30 లక్షల మీటర్ల గుడ్డను ఉత్పత్తి చేయడం జరిగింది.
Ministers @KTRTRS, @SabithaindraTRS, and @SatyavathiTRS inspected the displays of Bathukamma sarees at Haritha Plaza, Hyderabad. Handlooms & Textiles Director Shailaja Ramaiyer was also present. pic.twitter.com/bAgKB30eVt
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) September 29, 2020