హ‌త్య‌ కేసులో నిందితుడికి జీవితఖైదు

పెద్ద‌ప‌ల్లి (CLiC2NEWS):  ఒంట‌రి మ‌హిళ‌ల‌ను హ‌త్య చేసి, ఆమె మెడ‌లోని బంగారం దొంగిలించిన కేసులో నిందితుడికి జీవిత‌కాల కారాగార శిక్ష‌తో పాటు రూ.10వేల జ‌రిమానా విధించారు. సుల్తానాబాద్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని కోదురుపాక గ్రామంలో కోదాటి చంద్ర‌మ్మ ఒంట‌రిగా నివ‌సిస్తుంది. ఒంట‌రిగా ఉంటున్న విష‌యం తెలుసుకున్న నిందితుడు ఆమె మెడ‌లో ఉన్న బంగారు గొలుసును దొంగిలించాల‌నే ఉద్దేశంతో రాత్రి స‌మంలో ఆమె ఇంటిలోకి ప్ర‌వేశించాడు. పీట‌తో ఆమె త‌ల‌పై కొట్టాడు. దీంతో చంద్ర‌మ్మ అక్క‌డిక‌క్క‌డే మృతి చెందింది. అనంత‌రం ఆమె మెడ‌లోని గొలుసును తీసుకుని నిందితుడు ప‌రార‌య్యాడు. మృతిరాలు కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు పోలీసులు నిందితుడిని ప‌ట్టుకున్నారు. నేడు పెద్ద‌ప‌ల్లి జిల్లా కోర్టులో నిందితుడికి జైలు శిక్ష ఖ‌రారైంది. ఈ సందర్భంగా  రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ప్రాసిక్యూషన్ బృందాన్ని అభినందించారు.

 

ఇంట్లో నుండి బీరువా, న‌గ‌దును ఎత్తుకెళ్లిన దుండ‌గులు

Leave A Reply

Your email address will not be published.