అప్పుడే మొదలైన.. భానుడి భగభగలు
హైదరాబాద్: అప్పడే భానుడి భగభగలు మొదలయ్యాయి. ఈ సారి వేసవిలో ఎండల తీవ్రత పెరిగే అవకాశముంది. తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలలో పెరుగుదల స్పష్టంగా కనిపిస్తుంది. శనివారం ఆదిలాబాద్లో 38 డిగ్రీలు, భద్రాచలంలో 38.5 , హన్మకొండలో 35, హైదరాబాద్లో 37.2, ఖమ్మంలో 36.2, రామగుండంలో 37.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయింది.
ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్న గాలులతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్టు వారు పేర్కొన్నారు.
అలాగే ఆదివారం, సోమవారాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు డిగ్రీల మేర పెరిగే అవకాశాలున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు.