అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్‌

విజయవాడ: విజయవాడ కనకదుర్గ అమ్మవారికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను, పసుపు కుంకుమలను సమర్పించారు. దసరా శరన్నవరాత్రి . తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ప్రకాశం బ్యారేజీ మీదుగా సీఎం వైఎస్ జగన్ దుర్గగుడికి చేరుకున్నారు. వేదపండితులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ముఖ్య‌మంత్రికి ఘనస్వాగతం పలికారు. కొండమీదకు చేరుకున్న సీఎం జగన్‌ కొండచరియలు విరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. సహాయక చర్యలను అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. అనంతరం వస్త్రధారణ పంచెకట్టు, తలపాగా చుట్టి అమ్మవారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు. సీఎం జగన్‌ వెంట మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు పార్థ సారధి, వల్లభనేని వంశీ,అబ్బయ్య చౌదరి, దూలం నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.

కాగా దుర్గగుడి అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.70 కోట్లు ప్రకటించారని ఆలయ చైర్మన్‌ పైలా సోమినాయుడు పేర్కొన్నారు. లడ్డూ పోటు, ఘాట్‌రోడ్‌ అభివృద్ధి, సోలార్‌ సిస్టమ్‌తో పాటు అభివృద్ధి పనులకు సీఎం నిధులు ప్రకలించారని తెలిపారు.  బెజవాడ ఇంద్రకీలాద్రీపై దుర్గ‌గుడి స‌మీపంలో కొండచరియలు విరిగి ప‌డ్డాయి. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురికి గాయాల‌య్యాయి. దీంతో అక్కడ ఉన్నవారంతా భయాందోళనతో పరుగులు తీశారు. ఇటీవల చిన్న చిన్న రాళ్లు విరిగిపడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరిక బోర్డుపెట్టారు. కొండ చరియలు విరిగిపడటంపై మీడియా హెచ్చరించినా.. అధికారులు పట్టించుకోకుండా.. కేవలం హెచ్చరిక బోర్డులు పెట్టి వదిలేశారు. రెండు మూడు రోజుల్లో అక్కడి కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని ఇంజనీరింగ్‌ అధికారులు ముందే హెచ్చరించారు. అయితే బుధవారమే కొండచరియలు విరిగిపడ్డాయి. ప్రస్తుతం సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.

Leave A Reply

Your email address will not be published.