ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్త‌గా 106 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో 35, 804 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 106 కేసులు నమోదయ్యాయి. అలాగే తాజాగా వైరస్‌ బారినపడిన వారిలో 57 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేర‌కు రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంగ‌ళ‌వారం సాయంత్రి బులిటెన్ విడుద‌ల చేసింది. తాజా కేసుల‌తో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు ఆంధ్రప్రదేశ్‌లో 8,90,080 మంది కరోనా బారినపడ్డారు. వీరిలో 8,82,137 మంది చికిత్సకు కోలుకున్నారు. ప్ర‌స్తుతం 774 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా వైరస్ ప్రభావంతో 7169 మంది మ‌ర‌ణించారని అధికారులు వెల్ల‌డించారు.

Leave A Reply

Your email address will not be published.