ఆక్స్‌ఫర్డ్ టీకా తీసుకున్న 82 ఏళ్ల డయాలసిస్ పేషెంట్

లండన్: బ్రిటన్‌లో 82 ఏళ్ల డయాలసిస్ పేషెంట్ బ్రియాన్ పింకర్ ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఆస్ట్రాజెన్‌కా-ఆక్స్‌ఫర్డ్ తయారు చేసిన టీకాను తొలి వ్యక్తిగా తాను తీసుకోవడంతో సంతోషంగా ఉందని బ్రియాన్ తెలిపారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ హాస్పిటల్‌లో ఆ వృద్ధుడికి టీకాను ఇచ్చారు. ఆక్స్‌ఫర్డ్‌లోనే పుట్టి, పెరిగినట్లు ఆ 82 ఏళ్ల వృద్ధుడు తెలిపారు. కోవిడ్ వ్యాధి కోసం టీకాను ఆక్స్‌ఫర్డ్‌లో కొనుగొనడం గర్వంగా ఉందని ఆయన అన్నారు.