ఆగిన బస్సును ఢీకొట్టిన మినీవ్యాన్: ఆరుగురు మృతి
కృష్ణగిరి:తమిళనాడులోని కృష్ణాగిరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున సేలం నుంచి బెంగళూర్ వెళ్తున్న తమిళనాడు ఆర్టీసీ బస్సును కావేరిపట్టినం వద్దకు రాగానే ప్రయాణికుడు దిగేందుకు డ్రైవర్ బస్సు ఆపాడు. దిగిన ప్రయాణికుడు బస్సు దిగి వెనుక వైపు నుంచి రోడ్డు దాటుతుండగా అటు వైపుగా వస్తున్న మినీవ్యాన్ అతడిని ఢీకొని ఆగిన బస్సు కిందకు బలంగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ప్రమాదంలో మినీవ్యాన్ ప్రయాణిస్తున్నఐదుగురు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న కావేరిపట్టినం పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.