ఆచార్య నందిపాటి సుబ్బారావుకు ప్రపంచ శాస్త్రవేత్తగా గుర్తింపు

విశాఖపట్నం: విశాఖలోని ఆంధ్రవిశ్వ విద్యాలయ భూవిజ్ఞానశాస్త్ర విభాగాధిపతిగా విధులునిర్వర్తించిన ఆచార్య నందిపాటి సుబ్బారావుకు ప్రపంచ శాస్త్రవేత్తగా గుర్తింపు లభించింది. అమెరికాలోని స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం భారతదేశం నుంచి పలువురు శాస్త్రవేత్తలకు ర్యాంకింగులు ఇచ్చింది. అందు ఆచార్య నందిపాటి సుబ్బారావు ర్యాంకును 557గా ఖరారు చేసింది. పర్యావరణ సాంకేతికరంగ విభాగంలో ఆయన పేరును పొందుపరచింది. అంతేకాకుండా ఆయన పర్యావరణ హైడ్రోజియాలజీ సంబంధిత అంశాలపై ఆయన వందకుపైగా పరిశోధనా పత్రాలను సమర్పించి ‘లిమ్కాబుక్ రికార్డు`ను కూడా సాధించారు. ఇంతకు ముందు ఈయన జాతీయ ఖనిజ అవార్డును, ఆంధ్రప్రదేశ్ సైంటిస్ట్ అవార్డును, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు.