ఆటోను ఢీకొట్టిన లారీ.. గర్భిణి మృతి

వరంగల్: జిల్లాలోని వ‌రంగ‌ల్‌-ములుగు జాతీయ రహదారిలో దామెర మండలం ఊరుగొండ గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో విషాదం చోటు చేసుకుంది. ఇక్క‌డ జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ఓ గర్భిణి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. నల్లబెల్లి మండల కేంద్రం నుంచి వరంగల్ వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న లారీ బ‌లంగా ఢీకొంది. ఈ ప్ర‌మాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన గర్భిణి గంగారపు సంగీత (30) అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. విష‌యం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

త‌ప్ప‌క‌చ‌ద‌వండి:గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య..!

Leave A Reply

Your email address will not be published.