ఆన్‌లైన్‌లో రామ‌కృష్ణ మ‌ఠం స్పోకెన్ ఇంగ్లిష్ త‌ర‌గ‌తులు

హైద‌రాబాద్: రామకృష్ణ మఠం హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో అతి త్వ‌ర‌లో స్పోకెన్ ఇంగ్లిష్ త‌ర‌గ‌తులు ప్రారంభం కానున్నాయి. 09 జ‌న‌వ‌రి 2021 వ తేదీ నుండి బేసిక్‌, జూనియ‌ర్ స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులు ఆన్‌లైన్ ద్వారా ప్రారంభం కానున్న‌ట్లు నిర్వాహాకులు తెలిపారు. ఈ శిక్షణ శిభిరంలో పాల్గొనే అభ్యర్థులు ఈ నెల డిసెంబర్ 28వ తేదీ లోపు రామకృష్ణ మఠం హైదరాబాద్ వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్ అడ్మిషన్ పొందగలర‌ని సూచించారు. అభ్యర్థి కనీస వయసు 17 సంవత్సరాలు, లేదా 10వ తరగతి పాస్ అయి ఉండాలన్నారు. శిక్షణ రుసుము రూ. 1300. శిక్షణకు సంబంధించిన మెటిరియ‌ల్‌ను పోస్ట్ ద్వారా పంప‌నున్నారు. ఇతర సందేహాలకు 040- 27635545 ఫోన్ నెంబర్‌లో సంప్రదించాల్సిందిగా తెలిపారు. http://rkmathadmissions.winnou.net/ లింక్ ద్వారా అడ్మిషన్ పోందవ‌చ్చ‌న్నారు. కొవిడ్ కార‌ణంగా ల‌భిస్తున్న ఈ సువ‌ర్ణ అవకాశాన్ని మారుమూల గ్రామాల‌ విద్యార్థులు, ఉద్యోగులు వినియోగించుకోవాల్సిందిగా కోరారు.

Leave A Reply

Your email address will not be published.