ఆరో రౌండ్‌లో టిఆర్ ఎస్ ఆధిక్యం

సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి రౌండ్ నుంచి ఆధిక్యంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఆరో రౌండ్‌లో వెనుకంజ వేసింది. ఆరో రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత రెడ్డికి 4062 ఓట్లు పోలవగా, బీజేపీకి 3709 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి 530 ఓట్లు పోలైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఆరో రౌండ్ ముగిసేసరికి బీజేపీకి 2,667 ఓట్ల మెజార్టీ వచ్చింది.
6
ఆరో రౌండ్‌లో టీఆర్‌ఎస్ 353 ఓట్ల ఆధిక్యం సాధించింది. ఆరు రౌండ్లు ముగిసేసరికి బీజేపీ 2,667 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది.
5 ఐదో రౌండ్‌లోనూ బీజేపీ 336 ఓట్ల ఆధిక్యం సాధించింది. ఐదో రౌండ్లు ముగిసే సరికి బీజేపీ 3,020 ఓట్ల లీడ్‌లో ఉంది. ఇప్పటివరకు బీజేపీ 16,507.. టీఆర్‌ఎస్ 10,497.. కాంగ్రెస్ 2,724 ఓట్లు సాధించాయి.
4
నాలుగో రౌండ్‌లో బీజేపీ 2,684ఓట్ల ఆధిక్యం సాధించింది. నాలుగో రౌండ్‌లో బీజేపీ 3,832.. టీఆర్‌ఎస్ 2,407.. కాంగ్రెస్ 227 ఓట్లు సాధించాయి. మొత్తంగా బీజేపీ 13,055, టీఆర్‌ఎస్ 10,371 కాంగ్రెస్ 2,158 ఓట్లు సాధించాయి. నాలుగో రౌండ్‌లోనూ బీజేపీ హవా కొనసాగుతోంది. బీజేపీ నాలుగో రౌండ్‌లో 1,425 ఓట్లు ఆధిక్యత సాధించారు.
3
మూడో రౌండ్‌లో కౌంటింగ్ ముగిసే సరికి బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ అభ్యర్థి రఘనందన్ రావు 1,259 ఓట్ల ఆధిక్యం సాధించారు. ఇప్పటిదాకా బీజేపీకి 9,224.. టీఆర్‌ఎస్‌కి 7,964.. కాంగ్రెస్‌కి 1,931 ఓట్లు లభించాయి.
2
రెండో రౌండ్‌లో బీజేపీ 279 ఓట్ల ఆధిక్యత సాధించింది. రెండో రౌండ్‌లో బీజేపీకి 1,561 ఓట్లు, టీఆర్ఎస్ పార్టీకి 1,282 ఓట్లు లభించాయి. మొదటి రెండు రౌండ్లు ముగిసేసరికి బీజేపీ మొత్తం 1,135 ఓట్ల ఆధిక్యంలో ఉంది. రెండు రౌండ్లు ముగిసేసరికి బీజేపీకి 6,492, టీఆర్ఎస్‌కు 5,357 ఓట్లు, కాంగ్రెస్‌కు 1,315 ఓట్లు లభించాయి.
1
దుబ్బాక ఉపఎన్నిక తొలి రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు 341 ఓట్ల ఆధిక్యం సాధించారు. బీజేపీ మొదటి స్థానంలో నిలవగా, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు.. రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నాయి. మొదటి రౌండ్‌లో బీజేపీ 3,208 ఓట్లు సాధించగా.. టీఆర్‌ఎస్ 2,867.. కాంగ్రెస్ 648 ఓట్లు సాధించాయి. తొలి రౌండ్‌లోదుబ్బాక మండలానికి చెందిన ఈవీఎంలలోని ఓట్లను లెక్కించారు.