ఆర్టీసీ: ఇక హోం డెలివరీ..

హైద‌రాబాద్‌: తెలంగాణ ఆర్టీసీలో ప్రయోగాత్మకంగా ఇవాళ్టి నుంచి ఇంటికే పార్శిళ్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఖైరతాబాద్‌లోని రవాణాశాఖ కార్యాలయంలో టీఎస్ఆర్టీసీ పార్శిల్ – హోమ్ డెలివరీ సేవలను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. సుమారు 3 నెలల పాటు ప్రయోగాత్మకంగా సేవలు అందించనున్నారు. విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు. డోర్‌ టూ డోర్‌ సేవల కోసం మూడు సంస్థలను ఇప్పటికే అధికారులు ఎంపిక చేశారు. నగరాన్ని మూడు సెక్టార్లుగా విభజించి ఆయా సంస్థలకు అప్పగించింది. ఇక నుంచి నేరుగా వినియోగదారుడి ఇంటికే ఆర్టీసీ పార్శిల్‌ కార్గో సేవలు అందనున్నాయి. డెర్‌ డెలివరీ సేవలతో ఆర్టీసీ రోజుకు మరో రూ.13లక్షల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.. తొలిదశలో జంట నగరాల్లో హోమ్ డెలివరీ సర్వీసులు ప్రారంభిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.