ఆర్టీసీ ఉద్యోగుల నిరసన
హైదరాబాద్: కేంద్ర సర్కార్ తీసుకున్న ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగసంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టాయి. సోమవారం ఉదయం కార్మికులు, ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఒకే దేశం-ఒకే పర్మిట్ పేరుతో కేంద్రం చట్టం చేస్తున్నదని, ఇది ప్రైవేటు బస్సులకు ఉపయోగపడేలా ఉన్నదని ఉద్యోగ సంఘాలు విమర్శించాయి. అలాగే ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ ప్రభుత్వ బ్యాంకులకు చెందిన దాదాపు 10 లక్షల మంది ఉద్యోగులు సోమ, మంగళవారాల్లో సమ్మెకు దిగనున్నారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఇందులో 9 యూనియన్లు ఉన్నాయి. ఐడీబీఐ సహా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల బడ్జెట్ ప్రసంగంలో చెప్పడం సమ్మెకు ప్రధాన కారణం.