ఆర్టీసీ బస్సులో రూ.1.9 కోట్ల నగదు పట్టివేత..
కర్నూలు: ఎపిలోని కర్నూలు సమీపంలోని పంచలింగాల చెక్‌పోస్టు వద్ద స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో చేపట్టిన తనిఖీల్లో రూ. 1.9 కోట్ల నగదు పట్టుబడింది. అనంపురంలోని మారుతీనగర్‌కు చెందిన కోనేరు రామచౌదరి, గుంతకల్‌కు చెందిన రంగనాయకులు హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు బస్సులో వస్తున్నారు. నిఘా వర్ఘాల సమాచారంతో సిఐ లక్ష్మీ దర్గయ్య, ఇతర సిబ్బంది బస్సును తనిఖీ చేయగా 1.9 కోట్ల రూపాయల నగదు బయటపడింది. ఈ నగదుకు సంబంధించి ఎలాంటి పత్రాలు చూపకపోవడంతో నగదును సీజ్ చేసి స్థానక కర్నూలు అర్బన్ పోలీసు స్టేషన్లో అప్పగించారు. రామచౌదరిని విచారించగా పొలం కొనుగోలు కోసం హైదరాబాద్ వెళ్లామని బేరం కుదరకపోవడంతో డబ్బుతో స్వగ్రామానికి వెళుతున్నట్లు పోలీసులకు తెలిపారు.